ఏపీలో గడపగడపకు YCP కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంత్రి రోజా చిత్తూరు- నగరిలో పర్యటించారు. ఈక్రమంలో ఆమె ఓ వృద్ధుడితో మాట్లాడారు. ఫించన్ వస్తుందా ? లేదా ? అని అడిగారు. తనకు నెలనెలా ఫించన్ వస్తుందని, అయితే తాను ఒంటరిగా ఉన్నందున తనకు పెళ్లికూతురుని చూడాలని కోరాడు. ఆయన విన్నపం విన్న రోజా నవ్వుతూ ‘ఫించను అయితే ఇవ్వగలం కానీ పెళ్లి ఎక్కడి నుంచి చేస్తాం’ అంటూ సమాధానం ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement