Saturday, November 23, 2024

Tirupati: రూ.20 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

తిరుపతి సిటీ, జూన్ 14 ప్రభ న్యూస్ : అంతరాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 20 లక్షల విలువైన 150 కేజీల గంజాయితో పాటు నాలుగు సెల్ ఫోన్లు, మహేంద్ర వాహనం స్వాధీనం చేసుకోవడంతోపాటు 75 ప్యాకెట్ల రూపంలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. వెంకటగిరి, సర్కిల్ ఏర్పేడు నందు వాహనాలు తనిఖీ చేస్తుండగా మహేంద్ర వాహనంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఆ ప్రాంతంలో వాహనాలు తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.

కేరళ త్రిశూల్ జిల్లా చెందిన జీజేష, అనకాపల్లి జిల్లాకు చెందిన వెంకటరమణతో పాటు, అదే జిల్లాకు చెందిన రామకృష్ణఅను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వ్యక్తులను కేరళ రాష్ట్రం త్రిశూల్ జిల్లాకు చెందిన రంజిత్, అనకాపల్లి జిల్లాకు చెందిన పవన్, నిరంజన్, కేరళకు చెందిన విష్ణు, శ్రీజిత్ న్నారన్నారు. ముందస్తు సమాచారం మేరకు వీరిని అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. వీరిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయడం జరిగిందని వివరించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి, ఐడి పార్టీ సిబ్బందిని అభినందించి రివార్డులను ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్.ఈ .బి. ఎస్పి. రాజేంద్ర, రేణిగుంట డిఎస్పి భవ్య కిషోర్, ఏర్పేడు సిఐ శ్రీహరి, రేణిగుంట సిఐ, సుబ్బారెడ్డి, రేణిగుంట ఎస్సై ఈశ్వరయ్య, ఐటీ పార్టీ సిబ్బంది బారోసా రాజశేఖర్, సోము సూరి, ఏర్పేడు సిబ్బంది చక్రి నాయక్, గురవయ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement