తిరుపతి సిటీ : ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే… తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లిలో నివాసముంటున్న రంజిత్ కుమార్ (31) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన భార్య ఆస్పత్రికి తరలించే లోపే మృతిచెందారు. ఓ ట్రావెల్స్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవారు. మానసిక ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య హారిక ఎం.ఆర్.పల్లి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి ఎం.ఆర్.పల్లి పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఎస్.వి. మెడికల్ కళాశాలకు తరలించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital