తిరుపతి సిటీ .. ప్రభ న్యూస్ : పరిపాలనా సౌలభ్యం, శాంతి భద్రతల పరిరక్షణ కొరకు రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా తిరుపతి పోలీసు జిల్లాలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి తెలియజేశారు. ఈ మార్పులను ప్రజలు గమనించి పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన భారీ మార్పులను వివరించారు. తిరుపతి వెస్ట్ సబ్ డివిజన్‌ను చంద్రగిరి సబ్ డివిజన్‌గా పేరు,పరిధిని మార్పులు చేశామన్నారు.కొత్తగా ఏర్పడిన చంద్రగిరి సబ్ డివిజన్‌లోకి 7 పోలీస్ స్టేషన్లను వస్తాయన్నారు. తిరుపతి రూరల్ (ముత్యాలరెడ్డి పల్లి), తిరుచానూరు, చంద్రగిరి, రామచంద్ర పురం, పాకాల, యర్రవారి పాలెం, భాకరా పేట పోలీస్ స్టేషన్‌లను చేర్చినట్లు ఎస్పీ వెల్లడిరచారు. గతంలో తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్‌లోని తిరుచానూరు పోలీస్ స్టేషన్‌ను క్రొత్తగా ఏర్పడిన చంద్రగిరి సబ్ డివిజన్‌లోకి చేర్చారు.
ఇదివరకు ఉన్న ముత్యాలరెడ్డి పల్లి పోలీస్ స్టేషన్‌ను తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌గా మార్పు చేశారు. కొత్తగా ఏర్పడిన తిరుపతి సబ్ డివిజన్‌లోకి 4 పోలీస్ స్టేషన్లను వస్తాయని ఎస్పీ తెలిపారు. తిరుపతి ఈస్ట్, అలిపిరి, వెస్ట్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లను చేర్చారు. గతంలో తిరుపతి వెస్ట్ సబ్ డివిజన్‌లో ఉన్న తిరుపతి వెస్ట్, ఎస్.వి యూనివర్సిటి పోలీస్ స్టేషన్‌లను ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన తిరుపతి సబ్ డివిజన్‌లోకి చేర్చినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ముత్యాలరెడ్డి పల్లి పోలీస్ స్టేషన్‌ను తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌గా పేరు మార్పు చేశారు. అంతేకాకుండా ముత్యాలరెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంతకు ముందు ఉన్న 15 గ్రామ పంచాయతీలైన గాంధీపురం, చిగురువాడ, దుర్గసముద్రం, మల్లంగుంట, రామానుజపల్లి, సి.గొల్లపల్లి, పైడిపల్లి, పాతకాల్వ, పెరుమాళ్లపల్లి, సి.మల్లవరం, చెర్లోపల్లి, వెంకటపతి నగర్, పుదిపట్ల, పేరూరు, తుమ్మలగుంటలను యధావిధిగా తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కొనసాగుతాయన్నారు. ఇది వరకు తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అవిలాల, లింగేశ్వర్ నగర్, సాయి నగర్, ఓటేరు, శ్రీనివాసపురం గ్రామ పంచాయతీలను తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈఎస్‌ఐ హాస్పిటల్ జంక్షన్ నుండి శ్రీనివాస కళ్యాణ మండపం వరకు, శ్రీనివాస కళ్యాణ మండపం నుండి సింధు ఫ్లై ఓవర్ జంక్షన్ వరకు, సింధు ఫ్లై ఓవర్ జంక్షన్ నుండి ఆర్‌సీ పురం జంక్షన్ వరకు, ఆర్‌సీ పురం జంక్షన్ నుండి ఈఎస్‌ఐ హాస్పిటల్ జంక్షన్ వరకు ఉన్న ఈ నాలుగు ప్రధాన మార్గాల మధ్య ఉన్న ప్రాంతాల నన్నింటినీ తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి చేర్చారు.
ఇది వరకు ముత్యాలరెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తిరుపతి, మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ 15, 14వ డివిజన్‌లో కొంత భాగాన్ని అన్నమయ్య సర్కిల్ నుండి ఈఎస్‌ఐ హాస్పిటల్ జంక్షన్ వరకు హద్దులు నిర్ణయించారు. తూర్పు బాగంలో ఉన్న బైరాగిపట్టెడ, ఇతర ప్రాంతాలు, ఈఎస్‌ఐ హాస్పిటల్ జంక్షన్ నుండి, ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కాలేజీ జంక్షన్ వరకు ఉన్న రోడ్డుకు ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాలను ఒక పరిధిలోకి తీసుకొచ్చారు. ఇది వరకు తిరుచానూరు పరిధిలోని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్‌లోని శ్రీనివాస కళ్యాణమండపం నుండి వివేకానంద విగ్రహం, రాఘవేంద్ర నగర్ 5వ క్రాస్ నుండి కేశవాయనగుంట మెయిన్ రోడ్డు మధ్యలో ఉన్న భాగమంతా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చినట్లు వివరించారు. కొరమీను గుంట ప్రాంతం ఇదివరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వుండేది. ప్రస్తుతం ఈ ఏరియా పూర్తిగా అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్పు చేశారు.అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏరియాలు ఆర్.కె. డీలక్స్ జంక్షన్ నుండి గరుడ సర్కిల్ వరకు, స్విమ్స్, రుయా, బర్డ్, ఆయుర్వేదిక్ కాలేజీ, సంబందిత స్టాఫ్ క్వార్టర్స్, గరుడ సర్కిల్ నుండి జూ పార్క్ రోడ్, వేదిక్ యునివర్సిటి, సైన్స్ సెంటర్, అరవింద్ ఐ ఆసుపత్రి, టాటా కాన్సర్ హాస్పిటల్, భారతీయ విద్యా భవన్‌ను వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్పు చేశారు. ముత్యాలరెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లు 19, 20, 22వ డివిజన్‌లో కొంత భాగమైన అన్నమయ్య సర్కిల్ నుండి అవిలాల జంక్షన్ వరకు ఉన్న రోడ్డుకు పడమరగా ఉన్న ప్రాంతాలను, అవిలాల జంక్షన్ నుండి వైకుంఠపురం, తెలుగు తల్లి విగ్రహం, చాముండేశ్వరి గుడి వరకు ఉత్తరం వైపుగా గల ప్రాంతాలు ఎల్.ఎస్. నగర్‌ను యస్.వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి చేర్చారు.తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంతకు ముందున్న 9 గ్రామ పంచాయతీలైన తిరుచానూరు, పద్మావతి పురం, వేదాంతపురం, కేసిపేట, తనపల్లి, పాడిపేట, ముండ్లపూడి, బ్రాహ్మణపట్టు, కుంట్రపాకం తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో యధావిధిగా కొనసాగుతాయి. ఇది వరకు అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధి లోని మంగళం క్వార్టర్స్, రణధీర్ పురం, సప్తగిరి నగర్, బిటిఆర్ పురం, శెట్టిపల్లి పంచాయతీలోని మంగళం, మిట్ట గాంధీ పురం, చెన్నాయగుంట గ్రామాలను తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు. పోలీస్ సంబంధిత సేవల కొరకు ప్రజలు పైన తెలిపిన పోలీస్ స్టేషన్‌ల పరిధులలో మార్పులను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పిలు కులశేఖర్ శాంతి భద్రత, డిఎస్పిలు సురేంద్ర రెడ్డి, యశ్వంత్, సిఐలు సురేంద్ర రెడ్డి, రవీంద్రనాథ్, సుబ్రమణ్యం రెడ్డి, అబ్బన్న తదితరులు పాల్గొన్నారు.