Saturday, November 23, 2024

చిత్తూరు జిల్లాలో అల్పపీడనం ఎఫెక్ట్.. నీట మునిగి పొలాలు.. కూలిన ఇండ్లు..

తిరుపతి,(ప్రభ న్యూస్‌): అల్పపీడనం ప్రభావంతో శనివారం రాత్రి నుంచి చిత్తూరు జిల్లాలోని తూర్పు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. పడమటి మండలాల్లో ఓ మోస్తరుగా కురిసింది. వరదయ్యపాళెం మండలం గూడలవారిపాళెం పంచాయతీ, చెంచువారి చెట్టికండ్రిగలో వర్షానికి పూరి గుడిసె గోడలు కూలి కృష్ణ య్య(45) ఆదివారం ఉదయం మృతి చెందాడు. తిరుపతి, చిత్తూరుతో పాటు శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు, పుత్తూరు పట్టణాల్లో ఉదయం నుంచే ఎడతెరిపి లేని వర్షం కురిసింది. వర్షం ధాటికి ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు వెళ్లలేక పోయారు. పలు చోట్లలో తట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది.

కపిలతీర్థం, మాల్వాడి గుండం జలపాతాలను చూసేందుకు పెద్ద ఎత్తున నగర ప్రజ లతో పాటు పర్యాటకులు చేరుకున్నారు. సదాశివకోన రిజర్వాయర్‌కు వర్షపు నీరు చేరుకుంది. పిచ్చాటూరు మండలంలో శనివారం రాత్రి నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాలు నీట మునిగాయి. ఎస్‌ఎస్‌బీ పేట, హను మంతపురం హరిజనవాడలోని ఇళ్లలోకి వరదనీరు చేరి చెరువును తలపిస్తోంది. ఆరణియార్‌ ప్రాజెక్టు నుంచి 1,200 క్యూసెక్కుల నీటిని ఆదివారం విడుదల చేశారు.

వ్యవసాయ పంట పొలాలలోకి భారీగా వరదనీరు చేరి తీవ్ర పంటనష్టాన్ని కలిగించింది. ఉదయం 6 గంటలకే ఆరణియార్‌ ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తివేశారు. పిచ్చాటూరు, శ్రీకాళ హస్తి మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. అరుణా నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. శ్రీకాళహస్తిలో లోతట్టు ప్రాం తాలన్నీ జలమయమయ్యాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement