Tuesday, November 26, 2024

ఏప్రిల్ 10న లోక్ అదాల‌త్ – న్యాయ‌మూర్తి కోటేశ్వ‌ర‌రావు..

శ్రీకాళహస్తి – జాతీయ లోక్ అదాలత్ ద్వారా అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించుకోవడానికి సహకరిస్తూ లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేయాలని శ్రీకాళహస్తి అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి పల్లపోలు కోటేశ్వర రావు అన్నారు. శనివారం స్థానిక అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో పోలీస్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ లాక్ డౌన్,కోవిడ్ విస్తరణ నివారణ చర్యలో భాగంగా గత సంవత్సరం పాటు కోర్టు లావాదేవీలు వర్చువల్ పద్దతిలో జరిగాయని, అలాగే లోక్ అదాలత్ లు కూడా అదే పద్దతిలో సామాజిక దూరం, మాస్క్ లు ధరించి తగు జాగ్రతులతో నిర్వహించుకుండామని తెలిపారు.అయితే రాజమార్గంలో కక్షిదారులతో ప్రత్యక్ష పద్దతిలో కేసుల పరిష్కర పద్ధతే బాగుంటుందని మిశ్రమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ లోక్ అదాలత్ కి కోర్టులో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసుల్లో కక్షిదారులను ఒప్పించి అధిక సంఖ్యలో వాటిని రాజమార్గంలో పరిష్కరించడానికి సమిష్టి కృషి అవసరమని న్యాయమూర్తి తెలిపారు. ఈ సమావేశంలో బి. యన్. కండ్రిగ , ఏర్పేడు , శ్రీకాళహస్తి 1వ,2వ,రూరల్ , తొట్టంబేడు పోలీస్ అధికారులు మరియు కోర్టు కానిస్టేబుల్స్ మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement