తిరుపతి సిటీ : 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ నెల 26వ తేదీ జరుగుచున్న సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తో కలిసి పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాట్ల సన్నద్ధతపై బుధవారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మాక్ డ్రిల్ రిహార్సల్ నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శకటాలు, వివిధ శాఖల స్టాళ్ళ ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి ఉట్టి పడేలా చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ వారిని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ, కనక నరస రెడ్డి, డిఆర్డిఎపి డి జ్యోతి, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, ప్రభావతి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement