Wednesday, November 20, 2024

హిందూ మ‌తాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు అడుగుతారా – విప‌క్షాల‌పై ల‌క్ష్మీ పార్వ‌తి ఫైర్..

తిరుపతి సిటీ ‌: హిందూ మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు అడగడం సరికాదని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి అన్నారు. తిరుప‌తిలో విలేకరుల సమా వేశంలో ఆమె మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత పైకి బీజేపీ, లోపల టీడీపీతో ఒప్పందం కుదుర్చుకు న్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మీద ఫ్యాక్షనిజం అంటగట్టడం సరికా దన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 22 మంది వైసీపీ కార్యకర్తలను పొట్టన పెట్టు-కున్నారని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ పతనం అయిందన్నారు. ప్రజలకు దూరమైన చంద్రబాబు వెన్నుపోటు దారుడిగా నిలిచిపోతా రన్నారు. లోకేష్‌ ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే గ్యాస్‌ పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంద న్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అయిన డాక్టర్‌ గురుమూర్తి అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ప్రత్యేక హోదా ప్యాకేజీ రాయలసీమ వెనకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామని బీజేపీ ఇచ్చిన హామీలు హామీలు గానే నిలిచిపోయాయన్నారు. విప‌క్షాలు ఏ మొహం పెట్టు-కొని ప్రజల దగ్గరికి వచ్చి ఓట్ల అడుగుతారని అర్థం కావడం లేదన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని సీఎం జగన్‌ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు.. త‌న‌ ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వెంటే ఉంటా అన్నారు..ఈ విలేకరుల సమావేశంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎం.వి.ఎస్‌ మనీ . రాకేష్‌ రెడ్డి. భీమాస్‌ అశోక్‌. వినిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement