Monday, September 16, 2024

TTD | టిఫిన్‌లో జెర్రి.. దాంతో మాకే సంబంధం లేదన్న టీటీడీ

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : తిరుపతి నగరంలోని ఓ హోటల్‌లో టిఫిన్‌ చేస్తున్న వ్యక్తికి జెర్రీ కనిపించింది.. అయితే.. ఇదీ తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ)కి తలనొప్పిగా మారింది. ఆ హోటల్ పేరు… తిరుమలలోని యాత్రికుల సముదాయం (పీఏసీ) పేరుకు దగ్గరి పోలికలు ఉండడమే కారణంగా తెలుస్తోంది.

తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో పని నిమిత్తం పుత్తూరు నుంచి తిరుపతికి వచ్చిన కొందరు ఓ హోటల్‌ లో భోజనం చేసేందుకు వెళ్లారు. ఆర్డ‌ర్ చేసిన టిఫిన్ ప్లేట్‌లో చ‌నిపోయిన‌ జెర్రీ కనిపించడంతో పెద్ద గొడవ జరిగింది. ప్రశ్నించిన వారిపై హోటల్ సిబ్బంది దాడి చేశారు..

దీంతో వారు ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఆరోగ్య సిబ్బంది తనిఖీలు చేసి సంబంధిత హోటల్ వంట గదికి తాళం వేశారు..

- Advertisement -

అయితే, ఆ హోటల్ పేరు.. తిరుమలలోని పిల్‌గ్రిమ్స్ కాంప్లెక్స్ పీఏసీ పేరు ఓకేలా ఉండడంతో టీటీడీ అధికారులకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి.. దీనిపై టీటీడీ అధికారులు విచారించగా.. అసలు విషయం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక తిరుపతిలోని ఆ హోటల్‌కు టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement