తిరుపతి – తిరుపతి ఉప ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ముమ్మరం చేశాయి.. టిడిపి, బిజెపి – జనసేన కూటమి, వైసిపిలు తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు శాసన సభ స్థానాలలో ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి.. ప్రచారంలోకి బిజెపి జాతీయ నేతలు కూడా రానున్నారు.. ఇప్పటికే బిజెపి అభ్యర్ధికి మద్దత్తుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకసారి ప్రచారం నిర్వహించగా, మరోసారి తిరుపతిలో జనసేనాని ప్రచారం నిర్వహించనున్నారు.. వైసిపి అభ్యర్ధి గురుమూర్తికి భారీ మెజార్టీతో గెలిపించే దిశగా వైసిపి అడుగులు వేస్తున్నది.. ఇప్పటికే 10 మంది మంత్రులు, 8మంది ఎంపిలు, 20 మంది ఎమ్మెల్యేలు తిరుపతి ప్రచారంలో పాల్గొంటున్నారు.. తాజాగా ప్రచార రంగంలోకి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ దిగనున్నారు.. ఈ నెల 14వ తేదిన తిరుపతిలో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.. ర్యాలీతో పాటు బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.. శాసనసభ ఎన్నికల ఇప్పటి వరకు ఏ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనని జగన్ తొలిసారిగా ప్రచార రంగంలోకి దిగుతుండటం విశేషం.. జగన్ ప్రచారం చేయడం వల్ల గతంలో కంటే మెజార్టీ పెరుగుతున్నదని వైసిపి నేతలు అభిప్రాయపడుతున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement