Friday, November 22, 2024

ఆ విగ్ర‌హాలు మ‌తి స్థిమితం లేని మ‌హిళ ధ్వంసం చేసింది…ఎస్పీ

కుప్పం విగ్రహాల ధ్వంసం కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. మతిస్థిమితం లేని జ్యోతి ఈ ఘాతుకానికి కారణమని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ప్రకటించారు. ఈ విగ్ర‌హాల ధ్వంసంఫై ఫిర్యాదు వ‌చ్చిన వెంట‌నే అన్ని కోణాల‌లో ద‌ర్యాప్తు జ‌రిపామ‌ని ఆయ‌న మీడియాకు చెప్పారు.. ల‌భించిన ఆధారాలు ఆధారంగా ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన మహిళ‌ను అదుపులోకి తీసుకున్నామ‌న్నారు.. ఆమె మాన‌సిక స్థితి స‌రిగా లేనందువ‌ల్లే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌న్నారు.. ఆమెను చికి్త్స కోసం హాస్ప‌ట‌ల్ కు పంపామ‌న్నారు..కాగా, ఈ ఘ‌ట‌న‌పై టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో స్పందించ‌డాన్ని ఎస్పీ త‌ప్పు ప‌ట్టారు.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, కేడర్‌ను రెచ్చగొట్టేలా చంద్ర‌బాబు వ్యాఖ్యలు చేశారని ఆక్షేపించారు. వాస్తవాలు తెలుసుకోకుండాసీబీఐ విచారణ కోరడం తగదన్నారు. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే రాజకీయ నాయకులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement