Tuesday, November 26, 2024

ఐ-రాడ్ పకడ్బందీగా అమలు జరగాలి : సీతారామి రెడ్డి

తిరుపతి సిటీ, మే 19 (ప్రభ న్యూస్) : కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు 15 సంవత్సరాలు దాటిన అన్ని రకాల ప్రభుత్వ వాహనాలకు రెన్యువల్ నిలుపుదల జరిగిందని త్వరలో రాష్ట్ర ప్రభుత్వం స్క్రాప్ పాలసీతో సంస్థను నియమించనున్నదని జిల్లా రోడ్డు భద్రతా కమిటీ కన్వీనర్, జిల్లా రవాణా అధికారి సీతారామి రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. అనంతరం జిల్లా రవాణా అధికారి సీతారాం రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల జీఎస్ఆర్ 29 ఈ మేరకు గతంలో లాగా కాలం చెల్లిన వాహనాల వేలం వేయడం చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం స్క్రాప్ పాలసీ ఇవ్వనున్నదని అందుకు సంబందించిన ఏజెంట్ కు మాత్రమే వాహనాలను అప్పజెప్పాల్సి ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ సహాయం అందించి ఆసుపత్రిలో చేర్పించిన వారికి ప్రాణాలు కాపాడినందులకు గుడ్ సమరిటన్ కార్యక్రమం ద్వారా రూ.5 వేలు పారితోషకం అందించనున్నదని ప్రతి ఒక్కరు భాద్యతగా ప్రమాదాల బారిన పడిన వారిని కాపాడాలని కోరారు. అలాగే ఐ-రాడ్ యాప్ నందు ప్రమాదాలను పోలీసు శాఖ వారు నమోదు చేస్తున్నారని వైద్య శాఖ చేయడం లేదని ఈ యాప్ ఉపయోగం కేంద్ర ప్రభుత్వం ప్రమాదాల నివారణకు సమీక్షించి పలు సూచనలు చేయడానికేనని తెలిపారు.

తిరుపతి ప్రముఖ పుణ్య క్షేత్రం యాత్రికులు విశ్రాంతి లేకుండా దూర ప్రయాణం నుండి వాహనాలలో రావడం ప్రమాదాలకు దారి తీస్తున్నదని టోల్ ప్లాజాల వద్ద స్టాప్ అండ్ వాష్ కార్యక్రమం రాత్రి 0 నుండి 4 గంటల వరకు చేపట్టగలిగితే ప్రమాదాలని వారించగలుగుతామాని ఇప్పటికే స్వర్ణా టోల్ ప్లాజా వారు నిర్వహిస్తున్నారని అన్నారు. అలాగే హెల్ మెట్, సీట్ బెల్ట్ వంటివి ఉపయోగించే విధంగా అవగాహన కల్పించడం పోలీస్, రవాణా శాఖ, వైద్య శాఖ సంయుక్తంగా నిర్వహించాలని అన్నారు. అలాగే బారీ వాహనాల పార్కింగ్ కు రెండింటికి స్థలం కోసం రెవిన్యూ అధికారులకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని అన్నారు. ట్రాఫిక్ డీఎస్పి నరసప్ప మాట్లాడుతూ ట్రై జంక్షన్లు సి.మల్లవరం, గాజులమండ్యo వద్ద పనులు వేగవంతం చేసి ప్రమాదాల నివారణకు చెన్నై హైవే అథారిటీ వారు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా ప్రజా రవాణాధికారి చెంగల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టిసి ఆధ్వ‌ర్యంలో ప్రతి నియోజకవర్గంలో హెవీ డ్రైవింగ్ స్కూల్ లు ఏర్పాటు చేసి ఇప్పటికే 500 మందికిపైగా శిక్షణ ఇచ్చామని, ఆర్టిసి డ్రైవర్లకు ప్రమాదాల నివారణకై తరచూ అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కమిటీ సమావేశంలో ఆర్అండ్ బి ఎస్ఈ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ మోహన్, స్వర్ణ టోల్ ప్లాజా హరి, రేణిగుంట – నాయుడుపేట మెగా ఇంజనీరింగ్ విజయ్ రాథోడ్, ఐ- రాడ్ ప్రాజెక్టు మేనేజర్ రత్న ప్రకాష్, రవాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement