Thursday, November 21, 2024

ప్రైవేట్ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని ఆదుకోండి…

మదనపల్లి రూరల్ – పాఠశాలల మూసివేత పై ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి అపుస్మా మద్దతు ఇస్తోందని, అయితే ఆర్థికంగా చితికిపోయిన ప్రైవేట్ పాఠశాలల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రైవేటు పాఠశాలల సంఘాల నాయకులు అప్పుస్మా అధ్యక్షులు కె. రఘునాథ రెడ్డి కోరారు. పాఠశాలల మూసివేతపై ప్రవేటు పాఠశాలల కరస్పండెంట్ల సమావేశం మంగళవారం స్థానిక యస్బిఐ కాలనీలో న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ -19 విశ్వరూపం దాల్చిన పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ప్రతిరోజూ రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో మూసివేత నిర్ణయానికి మద్దతుగా నిలిచి మంగళవారం నుండి సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. 2020 మార్చి 18 నుండి 2021 జనవరి 31 వరకు లొక్డౌన్ కొనసాగిందని, ప్రభుత్వం సడలింపుతో ఫిబ్రవరి నుండి తరగతులు ప్రారంభం చేశామని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ఏ స్కూల్ కరెస్పాండంట్ కు పైసా ఆదాయం లేక ఆర్థికంగా చాలా దెబ్బతినట్లు తెలిపారు. కేసులు తీవ్రత పెరగడం పాఠశాలలు మూతపడటం తో ఆర్థిక సమస్యలు అడిగమించడం భారంగా మారడం తోపాటు ప్రయివేట్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు జీతాలు తో ఆదుకోలేని దుస్థితి వచ్చిందని కావున తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విదంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడ ప్రయివేట్ బోధన బోద నేతర సిబ్బందికి బియ్యం మరియు నగదు అందించి ఆడుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎన్ జి ఓ లు ముందుకొచ్చి సహకారం ఇవ్వాలని కోరారు. గత రెండున్నర నెల కాలం కోవిడ్ కేసులు వెలుగు చూడకుండా చాలా జాగ్రత్తగా పాఠశాలలు
నడిపినట్లు చెప్పారు. కరోనాతో అత్యంత దారుణంగా దెబ్బతిన్నది విద్యా వ్యవస్థని, విద్యార్థుల విజ్ఞానానికి కరోనా అడ్డంకిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో ప్రైవేటు పాఠశాలల సంఘాల నాయకులు, ప్రెమ్సా అధ్యక్షులు ఆర్.వి. కేశవ రెడ్డి, కో-కన్వీనర్ ప్రవీణ్ కంటి మహంతి, ఎన్. రామకృష్ణా రెడ్డి, ఏం. శ్రీనివాస రావు, రాటకొండ ప్రసాద్, ఎమ్. రామకృష్ణా రెడ్డి, శ్రీ కృష్ణప్ప, చక్రపాణి, సహదేవ రెడ్డి, శ్రీనివాస శర్మ, బాబు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement