తిరుపతి సిటీ : బక్రీద్ పండుగ, తొలి ఏకాదశి పండుగ పర్వదినాలను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి ఒక శాంతి నిలయం, ఇక్కడ అన్ని మతాలు ఒక్కటే ఒకరి మనోభావాలను ఒకరు గౌరవించుకుంటు సంతోషంగా ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని శనివారం కోరారు. అందరూ ఐక్యమత్యంతో ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా శాంతియుతంగా మిత్ర భావంతో ప్రేమను పంచుకుంటూ పండుగ జరుపుకోవాలనీ ఆకాంక్షించారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రార్ధన మందిరాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, శాంతి భద్రతలకు విగాథం కలగకుండా అన్ని ఏర్పాట్లు పగడ్బందిగా ఏర్పాటు చేయడం జరిగింది అని తెలియజేశారు. 24 గంటలు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారని ప్రత్యేకంగా సోషల్ మీడియా వాట్సప్ గ్రూపులపై జిల్లా పోలీస్ శాఖ గట్టి నిఘా ఉంచిందని, ఆకతాయి చేష్టలతో సోషల్ మీడియాలో వదంతులను ఉద్దేశిపూర్వకంగా సృష్టిస్తే వారిని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించే లేదని హెచ్చరించారు. ఏదైనా ఘటన గురించి ముందస్తు చట్టబద్ధమైన సమాచారం ఇస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దనీ సూచించారు. ఏదైనా సమాచరం ఉంటే డైల్ 100 పోలీస్ వాట్స్అప్ నెంబర్.80999 99977, 79898 07665 నంబర్ కు సమాచారము అందించి ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.