తిరుపతి సిటీ : తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో కనుమ పండుగ సందర్భంగా సోమవారం గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి వేణుగానం, 8 నుండి 9 గంటల వరకు తిరుమల
శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం జరిపారు. ఉదయం 8 నుండి 10.30 గంటల వరకు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన, కోలాటాలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాల స్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆతరువాత భక్తులకు శ్రీవేణుగోపాల స్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేశారు . సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు అథితులు బహుమతులు పంపిణీ చేశారు. టీటీడీ ఈవో శ్రీ ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి, టీటీడీ గో సంరక్షణ ట్రస్టు సభ్యులు రామ్ సునీల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎస్వీ గోశాలలో ఘనంగా గోపూజ మహోత్సవం
Advertisement
తాజా వార్తలు
Advertisement