తిరుమలలో లడ్డూ కౌంటర్లను నిర్వహిస్తున్న కెవిఎం ఇన్ఫో కామ్ సంస్థకు చెందిన ముగ్గురు సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరు టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. టీటీడీ విజిలెన్స్ విభాగం ఫిర్యాదు మేరకు తిరుమల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా కొత్తపేటకు చెందిన జి.బబ్లూ అనే యువకుడి ఫిర్యాదు మేరకు టీటీడీ విజిలెన్స్ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. కెవిఎం ఇన్ఫో కామ్ సంస్థకు చెందిన మేనేజర్ గణేశ్, కో-ఆర్డినేటర్ చందు, లడ్డూ కౌంటర్ బాయ్ మేకల సురేశ్ కలిసి కెవిఎం ఇన్ఫో కామ్ సంస్థలో రెగ్యులర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువత నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేయడంతో బబ్లూ అనే యువకుడు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement