పుంగనూరు, జులై18 (ప్రభ న్యూస్) : రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఆశ్రయం కల్పించాడని మాజీ ఎంపీ రెడ్డప్ప కారుకు కొంతమంది ఆకతాయిలు నిప్పంటిచారు. కార్లో మంటలు చెలరేగి పెద్ద శబ్దాలు వచ్చాయి. చుట్టుపక్కల ప్రజలు భయకంపితులయ్యారు. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు అదుపు తెచ్చే లోపు కారు పూర్తిగా కాలిపోయింది.
కొంతమంది ఇంటికి తాళాలు వేసి పరుగులు తీశారు. పుంగనూరులో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడంపై పోలీసులపై స్థానిక ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.