Friday, November 22, 2024

ఎన్నో జన్మల పుణ్యం పోలీసు ఉద్యోగం : రేంజ్ డీఐజీ రవి ప్రకాష్

తిరుపతి సిటీ : ఎన్నో జన్మల పుణ్యం పోలీసు ఉద్యోగం అని అనంతపురం రేంజ్ డీఐజి రవి ప్రకాష్ తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్ మైదానం నందు కార్యక్రమం నిర్వహించారు. ఏఆర్ పోలీస్ హోమ్ గార్డ్ బ్యాండ్ పార్టీ చాలా చక్కగా ప్రదర్శించడం పట్ల వారిని అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీస్ శాఖ ఒక క్రమశిక్షణతో కూడుకున్న వ్యవస్థని, ఆ క్రమశిక్షణను కాపాడుకుంటూ విధులు క్రమశిక్షణగా చేయాలని కోరారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఇక్కడ ఉత్సవాలు పండగలు నిత్యం జరుగుతూ ఉంటాయని, ఇక్కడ ఉద్యోగం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని అని తెలియజేశారు. జిల్లాలో శాంతిభద్రతులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. అదే సమయంలో నేరాలను కూడా నియంత్రిస్తూ పుణ్యక్షేత్రాలకు వచ్చు భక్తులకు ప్రముఖులకు రక్షణ కల్పిస్తూ వారి నుంచి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సిబ్బందిని కోరారు. జిల్లా ల పునరు విభజన తర్వాత తిరుపతి జిల్లాలో నూతనంగా చేరిన గూడూర్ సబ్ డివిజన్, శ్రీహరికోట , సత్యవేడు, ఇండస్ట్రీ ఏరియాలో అతి ముఖ్యమైన ప్రాంతాలు కూడా కలవడం వలన రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాగా ఏర్పడిందన్నారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించుటకు తామంతా ఉన్నామని భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దులు కూడా ఉన్నందున రాబోయే సాధారణ ఎన్నికల సమయానికి మన శాఖ మరింత సన్నద్ధమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పోలీస్ డే చిన్న పొరపాటు చేసిన అది ప్రజల్లో వ్యతిరేకంగా అల్లుకుపోతుందన్నారు. పోలీస్ శాఖ సమాజంలో ఒక గుర్తింపు కలిగిన యూనిఫామ్ సర్వీస్ అయినందున పోలీసు వారు సమాజంలో ఏదైనా తప్పు చేస్తే చాలా తొందరగా వ్యాప్తి చెందుతుందన్నారు.. సాయి దళం బీడీ టీం ఏర్పాటుచేసిన అత్తవసర సమయంలో పోలీస్ శాఖ ఉపయోగించే వివిధ రకాల ఆయుధాల ఇష్టాలను తనిఖీ చేసి పలు సూచనలను అందజేశారు. అనంతరం తిరుపతి జిల్లా సాయుధ దళ ప్రధాన కార్యాలయాన్ని తనిఖీ చేసే పలు రికార్డులను పరిశీలించి వాహనాలను తనిఖీ చేసి అధికారులకు వాళ్లు సూచనలు సలహాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, అతనొప్పి ఎస్పీ అడ్మిన్ వెంకట రావు, లా అండ్ ఆర్డర్ అదరపు ఎస్పీ కులశేఖర్, క్రైమ్ అదరపు ఎస్పీ వేముల కుమారి, సే బ్ డైరెక్టర్ రాజేంద్ర, సాయుధ దళం డిఎస్పి లక్ష్మీనారాయణ రెడ్డి, ట్రాఫిక్ డీఎస్పిలు కాటమరాజు, రవీంద్రారెడ్డి, సాయిధ దళం లక్ష్మణ్ కుమార్ నందకిషోర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement