Friday, November 22, 2024

సంక్షేమ పథకాలతో ఆర్థికాభివృద్ధి : ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి

తిరుపతి సిటీ : వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అన్నారు. గురువారం పదవ డివిజన్ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి పర్యటించిన కరుణాకర్ రెడ్డి సంక్షేమ పథకాలను గురించి ప్రతి ఇంటిలోనే లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరును స్వయంగా ఆయన ఆరాధీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. ప్రతి ఇంటిలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న దాదాపు 25 నుంచి 30కు పైగా సంక్షేమ పథకాలలో కనీసం మూడు నుంచి నాలుగు పథకాల వరకు అందుతున్నాయి అన్నారు. ప్రతి పేదవాడిని లక్షాధికారిని చేయాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ మేయర్ డాక్టర్ శిరీష. కార్పొరేటర్లు దొడ్డారెడ్డి ప్రతాప్ రెడ్డి. రామస్వామి వెంకటేశ్వర్లు. వైఎస్ఆర్సిపి నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి. దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి. దొడ్డ రెడ్డి శ్రీనివాసరెడ్డి. సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement