Friday, November 22, 2024

లేబర్ కోడ్స్ పేరుతో కార్మిక హక్కులు హరించవద్దు

తిరుపతి సిటీ .. వామపక్షాలు, వాటి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు గురువారం తాజ్ హోటల్ నందు జరుగనున్న కార్మికశాఖ జాతీయ సదస్సు కార్యక్రమాన్ని అడ్డుకుంటామని పిలుపునివ్వడంతో నగరంలో వామపక్ష కార్యాలయం దగ్గర, నాయకులు ఇంటి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టి అరెస్టులు చేయడం జరిగింది. బైరాగి పట్టెడ వద్ద నిరసన ర్యాలీ చేస్తున్న ఏ.ఐ.టి.సి రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్. కుమార్ రెడ్డిలతోపాటు పలువురు నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అలాగే స్థానిక బేరి వీధి పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర మాజీ పార్లమెంటు సభ్యులు మధు.. మాజీ ఎమ్మెల్యే, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ గఫూర్, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్, సిఐటియు నాయకులు కందారపు మురళి అరెస్టు జరుగుతుందని వివరించారు.

44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుందని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత కార్మిక హక్కులను కాలరాయడం జరుగుతుందని వివరించారు. ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చని రాజ్యాంగం చెబుతుందని, చట్టధిక్కారమైనట్టు పోలీసులు వామపక్ష కార్యాలయం దగ్గర దిగ్బంధనం చేయడం ఏమిటని వారు విమర్శించారు. ముఖ్యమంత్రి మీ పద్ధతి ఏమిటి.. ప్రజాస్వామ్యం బతికి ఉందని అనుకుంటున్నాం.. మీరు చంపేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం బతికి ఉంటేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారని.. ప్రజాస్వామ్యం చనిపోతే మీరు ఎలా ముఖ్యమంత్రి అవుతారని తెలియజేశారు. ఇది ప్రజాస్వామ్య దేశం నిరసన తెలియజేసే హక్కు ఉంది.. రాను రాను కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఇంకనైనా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోర్టు చట్టాన్ని రద్దు చేయకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని, కేసులకు, జైలుకు భయపడేది లేదని, ఉంటే జైల్లో అయినా.. తమ నిరసన రోడ్డుపైన తెలియజేస్తామని వారు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement