తిరుపతి సిటీ : ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె విషయంలో తెగేదాక లాగొద్దని ప్రభుత్వానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ సూచించారు. శనివారం ఉదయం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ… పీఆర్సీ వ్యవహారంలో ప్రభుత్వం పై బ్రమలు తొలగి ఉద్యోగులు పోరుకు సిద్ధం కావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించాలన్నారు. పరిస్థితులు మరింత జటిలం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తద్వారా ఉద్యోగుల సమస్యలకు ముగింపు పలకాలని కోరారు. ఇదిలా ఉండగా రాజకీయాలతో మాకు సంబంధం లేదని ఉద్యోగ సంఘాలు అనడాన్ని నారాయణ తప్పుపట్టారు. ఉద్యోగ సంఘాలకు రాజకీయ పార్టీలతో అంటకాగాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యోగ సంఘాలను ఏ రాజకీయ పార్టీ ఉపయోగించుకుంటుందో సంఘాల నాయకులు గుర్తించాలని కోరారు. అదే సందర్భంలో రాజకీయ పార్టీలను అంటరానివిగా చూడడం ఉద్యోగ సంఘాలకు సరైందికాదని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..