తిరుపతి సిటీ .. అల్లర్లకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని తిరుపతి జిల్లా ఎస్పి పరమేశ్వర్ రెడ్డి సూచించారు. శుక్రవారం తిరుపతి రైల్వే స్టేషన్ నందు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నందు రైల్వే ఆర్మీలో స్వల్పకాలిక సర్వీస్ పేరుతో వచ్చిన వివాదంపై వందల కోట్ల ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో ముందుస్తు భాగంగా విస్తృతంగా తిరుపతి రైల్వే స్టేషన్ లో తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. నిరుద్యోగులు సమన్వయం పాటించాలని రైల్వే స్టేషన్ లో ఆందోళన చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. జిల్లా పరిధిలో తిరుపతి, పాకాల, రేణిగుంట, శ్రీకాళహస్తి, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో పికెట్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఏదైనా చిన్నపాటి సంఘటన జరిగినా కూడా వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీనివల్ల భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని తెలిపారు. తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రం ఇక్కడకు వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తూ ఉంటారని రైల్వే స్టేషన్ నందు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్. సిఐ శివప్రసాద్ రెడ్డి. రైల్వే పోలీసులు పాల్గొన్నారు.