Saturday, November 23, 2024

పోలీసుల అదుపులో నకిలి ఐడిలతో సేవా టికెట్లు పొందిన భక్తులు..

తిరుమల, ప్రభన్యూస్‌ ప్రతినిధి: తిరుమల శ్రీవారిని నకిలి ఐడిలు పెట్టి సేవా టికెట్లను పొందిన ఇద్దరు భక్తులను జిలెన్స్‌ అధికారులు పోలీసులకు అప్పచెప్పారు.వరాలిలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో తిరుమలలో సుప్రభాతం మరియు అర్చన సేవకు సంబంధించి స్వామివారి దర్శనానికి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు పొంది వచ్చు భక్తులు ఆన్‌లైన్‌లో లక్కిడిప్‌ ద్వారా సేవా టికెట్ల కొరకు ఉద్దేశ్యపూర్వకంగా, నకిలి ఆధార్‌ కార్డులు మరియు ఓటర్‌కార్డు ఐడి నంబర్లను ఉపయోగించి ఒకరి పేరుమీద ఎక్కువ సంఖ్యలో లక్కిడిప్‌ ద్వారా సేవా టికెట్లు బుక్‌ చేసుకుని తిరుమలకు వచ్చి టిటిడిని మోసం ుగిలిన భక్తులకు అవకాశం లేకుండా వాళ్లే ఎక్కువసార్లు సుప్రభాతం మరియు అర్చన సేవా టికెట్లు పొందుతున్నారు.

ఈ వీధంగా తమిళనాడుకు చెందిన రాజాసతీష్‌కుమార్‌, మరియు జ్ఞానశేఖరన్‌ అరుణాచలం అనే వారు మెయిల్‌ ఐడిల ద్వారా నకిలి ఓటర్‌ ఐడి నెంబర్లు ఉపయోగించి వారి పేర్లమీద సుప్రభాతం సేవా టికటొ పొంది ఎక్కువ సార్లు స్వామివారి దర్శనానికి వచ్చే వారు. సదరు రాజా సతీష్‌కుమార్‌ మరియు జ్ఞానశేఖరన్‌ అరుణాచలం కలసి సోమవారం సుప్రభాత సేవ నిమిత్తం తిరుమలకు రాగా ఆ ఇద్దరిని గుర్తించిన టిటిడి జిలెన్స్‌ వారి పిర్యాదు పై టూటౌన్‌ పోలీస్టేషన్‌ నందు వీరిద్దరి పై కేసు నమోదు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement