Saturday, November 23, 2024

ప్రశాంతంగా ముగిసిన ఉప సర్పంచ్ ల ఎన్నిక…

మదనపల్లి రూరల్ — మదనపల్లి మండలం లోని ని అంకి శెట్టిపల్లి మరియు ఈశ్వరమ్మ కాలనీ గ్రామ పంచాయతీల ఉప సర్పంచ్ ల ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిసాయి. గ్రామ సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నికల రోజు ఉప సర్పంచ్ ల ఎన్నిక వాయిదా పడింది. దింతో ఎన్నికల అధికారి ఇ రఫిక్ అహ్మద్ ఆధ్వర్యంలో బుధవారం అంకి శెట్టిపల్లి గ్రామంలో ఉప సర్పంచ్ ఎన్నికకు సర్పంచ్ శరత్ రెడ్డి మరియు 12 మంది వార్డు సభ్యులు హాజరయ్యారు. హలో సర్పంచ్ మద్దతుదారులు ఐదు మంది గెలుపొందగా వారిలో వై ఎస్ ఆర్ సి పి రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్డి శేఖర్ రెడ్డి మద్దతుదారులు ముగ్గురు గెలుపొందారు. అలాగే టిడిపి సర్పంచ్ అభ్యర్థి జంగాల వెంకటరమణ మద్దతుదారులు నలుగురు గెలుపొందారు. వైయస్సార్సీపి రెబల్ అభ్యర్థులు ముగ్గురు సర్పంచ్ శరత్ రెడ్డి అనుకూలంగా మారడంతో అతడి బలం పెరిగింది. దీంతో అంకి శెట్టిపల్లి ఉప సర్పంచ్ గా రమణమ్మ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈశ్వరమ్మ కాలనీ గ్రామపంచాయతీ లో సర్పంచ్ రెడ్డమ్మ తో పాటు 14 మంది వార్డు సభ్యులకు గాను 12 మంది వార్డు సభ్యులు హాజరయ్యారు. 12వ వార్డు సభ్యులుగా ఉన్న అక్బర్ వల్లిని సర్పంచ్ ఆధ్వర్యంలో ఎన్నికల అధికారి రఫీక్ అహ్మద్ ఉప సర్పంచ్ గా అక్బర్ వల్లిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉప సర్పంచ్ ల ఎన్నికలు పూర్తవడంతో 25 గ్రామపంచాయతీలో ఏప్రిల్ 3వ తేదీన సర్పంచు లకు ప్రభుత్వం అధికారాలు అప్పగించి తొలి సమావేశాన్ని నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement