Tuesday, November 26, 2024

స్మగ్లర్ల క్రూరత్వం.. పోలీస్ ని మరీ అలా చూపిస్తారా : డీఐజీ కాంతారావు

తిరుపతి, (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : ఎర్ర చందనం స్మగ్లింగ్పై తీసిన పుష్ప 1 సినిమా లో స్మగ్లర్ల క్రూరత్వాన్ని బాగా చూపించారు. కానీ పోలీసుల్ని కొంచం తక్కువ చేసి చూపించడం బాగాలేదు. పుష్ప 2 లో అయినా టాస్క్ ఫోర్స్ సిబ్బంది కష్టాన్ని చూపిస్తే బాగుంటుంది అని ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ మాజీ డీ ఐ జీ కాంతారావు అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టడం తో పాటు పలువురు అంతర్జాతీయ స్మగ్లర్లను పట్టుకోవడంలో, స్మగ్లింగ్ మూలాలను వెలుగులోకి తేవడంతో కాంతారావు కృషిని ఎవరు మరువలేరు.

రెండేళ్ల క్రితం పదవీ విరమణ చేసిన కాంతారావు బుధవారం సాయంత్రం తిరుపతిలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయం వద్దకు వచ్చారు. ఆ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో మాత్రమే తెలిసిన ఎర్రచందనం స్మగ్లింగ్ ను పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో చూపించిన దర్శకుడు సుకుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఆ సినిమాలో స్మగ్లర్ల క్రూరత్వాన్ని బాగా చూపించినా పోలీస్ సిబ్బంది తీరును కొన్ని సంఘటనల్లో వ్యతిరేకంగా వాస్తవ విరుద్దంగా చూపించారున్నారు. పుష్ప 2 లో అయినా ఎర్రచందనం అక్రమ రవాణాలో నివారించడంలో, విలువైన సంపదను కాపాడడంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది త్యాగాలను, కృషిని, టాస్క్ ఫోర్స్ , అటవీ శాఖ సిబ్బంది పనితీరును చూపిస్తే బాగుంటుందన్నారు అదేవిధంగా స్మగ్లింగ్ అరికట్టడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి భారత పౌరుడిగా సినిమాలో చూపించాలని విన్నవించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement