కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 72,540 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.91 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 33,339 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా.. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5వ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రెండేళ్లుగా ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించడంతో ఈసారి బ్రహ్మోత్సవాలకు పెద్దఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తుల రద్దీకి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.