Tuesday, November 26, 2024

కోవిడ్ బాధితులకు కంట్రోల్ రూమ్….కలెక్టర్ హరినారాయణన్

చిత్తూరు ప్రతినిధి, జిల్లాలో కోవిడ్ రెండవ దశ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నియంత్రణకు జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా స్థాయిలో నిరంతరం 24 గం. ల పాటు పని చేసే కమాండ్ కంట్రోల్ ను జిల్లా సచివాలయంలో ని గ్రీవిన్స్ హాల్ నందు ఈ నెల 19 నుండి అందుబాటులోకి తీసుకు వచ్చారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నందు కాంటాక్ట్ ట్రేసింగ్, ఫీవర్ క్లినిక్, హోమ్ ఐసోలేషన్ మానిటరింగ్, హోమ్ క్వారంటైన్ మానిటరింగ్, సాంపుల్ కలెక్షన్ మానిటరింగ్, ఇతర సంబంధిత అంశాల పై వైద్య ఆరోగ్య సిబ్బంది పని చేయడం జరుగుతుంది. ఈ నెల 19 నుండి కమాండ్ కంట్రోల్ రూమ్ అందుబాటులోకి రావడం జరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ నందు ప్రతి రోజూ మూడు షిఫ్ట్ లలో వైద్య ఆరోగ్య సిబ్బంది, మెడికల్ ఆఫీసర్లు విధులు నిర్వహించడం జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 104, 9849902379, 08572 – 242732, 242734 లకు ఫోన్ చేస్తే టెస్టింగ్, అడ్మిషన్లకు సంబంధించి సలహాలు, సూచనలు అందించడం జరుగుతుంది.

నోడల్ అధికారుల నియామకం:

కరోనా వ్యాప్తి నియంత్రణకు జిల్లా స్థాయిలో వివిధ విభాగాల్లో నోడల్ అధికారులను జిల్లా కలెక్టర్ నియమించారు. జిల్లా స్థాయి నోడల్ అధికారిగా డా. శరవణ శ్రీనివాస్ ను, టెస్టింగ్ కొరకు డిటిసిఓ డా. బి. రమేష్ బాబు, శాంపిల్ కలెక్షన్ మరియు సర్వైలెన్స్ కొరకు ఏపీడమాలజిస్ట్ డా. శ్రీవాణి, శాంపిల్ ట్రాన్స్ పోర్ట్ కొరకు డా. ఏ సుదర్శన్, లాబ్స్ కో- ఆర్డినేషన్ కొరకు డా. యుగంధర్, కాంటాక్ట్ ట్రేసింగ్ కొరకు డిపిఓ దశరథరామి రెడ్డి, అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డా. రమాదేవి, హోమ్ క్వారంటైన్ పర్యవేక్షణ జెడ్పి సిఇఓ ప్రభాకర్ రెడ్డి, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు వారి శాంపిల్ కలెక్షన్ల కొరకు డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ ను, కంటైన్మెంట్ క్లస్టర్ ఏర్పాటు, ఫీవర్ క్లినిక్ ల నిర్వహణ కొరకు జిల్లా మలేరియా ఆఫీసర్ పైడి రాజు, డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్/ఆర్డీఓలు, కోవిడ్ ఆస్పత్రులలో అవసరమైన ఏర్పాట్లు, వ్యాధిగ్రస్థుడి క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్, ట్రాయాజింగ్, హాస్పిటల్ అడ్మిషన్లను డి సి హెచ్ ఎస్ డా. సరళమ్మ, జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ డా. రాజ్యలక్ష్మి, డెమో నిర్మలమ్మలు, ప్రైవేట్ ఆసుపత్రులలో వసతులు ఏర్పాట్ల కొరకు ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డా. బాలాంజనేయులు, హోమ్ ఐసోలేషన్ కొరకు డా. అరుణ సులోచనా దేవి,104 కాల్ సెంటర్ ఇంచార్జ్ గా స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏ. రమేష్, హెల్ప్ డెస్క్ మరియు సి సి టివి మానిటరింగ్ కొరకు డా. నిరంజన్, వ్యాక్సినేషన్ పర్యవేక్షణ డి ఐ ఓ డా. సి. హనుమంత రావు, వ్యాక్సినేషన్ మొబిలైజేషన్ డిపిఓ, జెడ్పి సిఇఓ, డిఆర్డిఏ, మెప్మా పిడి లను ఏర్పాటు చేశారు. దీనితో పాటు డివిజనల్, మండల స్థాయిలో కూడా అధికారులను నియమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement