Tuesday, November 26, 2024

దొంగ ఓట్ల‌పై కొన‌సాగుతున్న మాట‌ల యుద్ధం….

అమరావతి, : రాష్ట్రంలో తెదేపా- వైకాపా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉభయ పక్షాల నేతలు విమర్శనాస్త్రాలు సంధిం చుకుంటూనే వున్నారు. తిరుపతి లోక్‌సభ ఎన్నికల ప్రక్రి య మొదలైన నాటి నుంచి అధికార విపక్ష నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తూనే ఉంది. అయితే పోలింగ్‌ అనం తరం కూడా ఉభయ పార్టీల నేతల మధ్య సవాళ్లు… ప్రతి సవాళ్లు పీక్‌ స్టేజ్‌కు వెళ్లడంతో ఏపీలో రాజకీయాలు మరిం త వేడెక్కాయి. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – తిరుపతి లోక్‌ సభ తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మీ, వైకాపా శాసనసభ్యులు కాకాని గోవర్ధనరెడ్డి- తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వీరి సవాళ్లు రాజీనామాల వరకూ వచ్చింది.
తిరుపతి ఎన్నికల్లో నకిలీ ఎన్నికల ఓటర్‌ ఐడి కార్డులతో వచ్చి, బయట నుంచి వచ్చిన వేలాది మంది ఓట్లు- వేసారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో తెదేపా వీడియోలతో సహా బయట పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా తెదేపా కుట్ర అంటూ వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయం మీద, తెదేపా పార్లమెంట్‌ అభ్యర్ధి పనబాక లక్ష్మి, బహిరంగ సవాల్‌ విసిరారు. గురువారం నాడు తిరుమల శ్రీవారి నేత్ర దర్శనం రోజు, పవిత్రమైన రోజున, ఆ రోజున మీరు ప్రమాణానికి సిద్ధం అవుతారా అని సవాల్‌ విసిరారు. దొంగ ఓట్లు- వేయలేదని, నకిలీ ఓటర్‌ కార్డులతో ఎవరూ రాలేదని, వారు అంతా భక్తులు అంటూ, తిరుమల దర్శనానికి, శ్రీకాళహస్తి దర్శనానికి వచ్చారు అంటూ, మంత్రి పెద్దిరెడ్డితో, ఇతర వైకాపా నేతలు చెప్తున్న నేపధ్యంలో, పనబాక లక్ష్మి సవాల్‌ విసిరారు. వారు దొంగ ఓటర్లు కాదని, నకిలీ ఓటర్లు కాదని, మాకు సంబంధం లేదని మీరు ప్రమాణం చేయగలరా, ఆ విషయంలో మీరు మా పైన ఆరోపిస్తున్నట్టు-, వారికి మాకు ఎలాంటి సంబం ధం లేదని, మేము ప్రమాణం చేస్తాం అంటూ పనబాక లక్ష్మి చాలెంజ్‌ చేశారు. గతంలో కూడా వివేక కేసు పై లోకేష్‌ మీద ఆరోపణలు చేయటం, లోకేష్‌ వెంకన్నపై ప్రమాణం చేద్దామని చాలెంజ్‌ చేయటం, ఆ తరువాత లోకేష్‌ ఒక్కడే ప్రమాణం చేయగా వైకాపా నేతలు దాన్ని తిప్పికోట్టిన విషయం తెలిసిందే.
ఇదిలావుండగా ఎన్నికల ప్రచారంలో మత్స్యకారులకు 43 కోట్ల ప్యాకేజీ ఇచ్చిన విషయం లోకేష్‌ నిరూపించాలని తాజాగా వైకాపా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి సవాల్‌ విసిరారు లోకేష్‌ వ్యాఖ్యలు అవాస్తవమని మీడియా వేదికగా నిరూపించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. తాను నిరూపించలేకపోతే 24 గంటల్లో తన రాజీనామా లేఖను మీడియాకు అందజేస్తానని కాకాని సవాల్‌ విసిరారు. ప్రమాణాలు చేయాల్సింది వైకాపా కాదని.. తెదేపా అధినేత చంద్రబాబు ప్రమాణం చేయాలని కాకాని రివర్స్‌ కౌంటర్‌ వేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు- పొడవలేదని చంద్రబాబు ప్రమా ణం చేయాలని కాకాని డిమాండ్‌ చేశారు. తెదేపా వద్ద మూడు స్కి ప్ట్రులు రెడీగా వుంటాయని, పరిస్థితిని బట్టి వాటిని జనంపై రుద్దడం తేదేపా నేతలకు అలవాటు-గా మారిందని కాకాని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement