తిరుపతి సిటీ ప్రభ న్యూస్ – తిరుపతిలో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పు అని ట్రాఫిక్ డిఎస్పి వన్ నరసప్ప. ట్రాఫిక్ డిఎస్పి టు రవికుమార్ తెలియజేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా.. ట్రాఫిక్ నియంత్రణ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యల్లో భాగంగా రామచంద్ర పుష్కరిణి వద్ద ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 15వ తేదీ నాటికి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలియజేశారు. అలాగే ఆటోలకు ఆర్..సి..ఇన్సూరెన్స్. ఫిట్నెస్ సర్టిఫికెట్ తోపాటు రికార్డులు తప్పనిసరిగా ఆటోలో ఉండాలన్నారు. అలా లేని పక్షంలో ఆటోలను సీజ్ చేస్తామన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలకుండా ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలో తప్పనిసరిగా పాటించాలన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకోరాదన్నారు. ప్రయాణికులను ఎక్కించుకునేటప్పుడు.. దించేటప్పుడు రోడ్డుకు పూర్తిగా పక్కకు వెళ్లి ఆపాలన్నారు.
నగరం అత్యంత ప్రాముఖ్యత పొందిన ఆధ్యాత్మిక నగరం అని.. ఇక్కడ దేశ విదేశాల నుండి భక్తులు యాత్రికులు వస్తూ ఉంటారని.. వారికి స్థానికంగా ఆలయాలను సందర్శించుకోవడం కొరకు ప్రత్యేకంగా ఆటోలోనే ప్రయాణిస్తూ ఉంటారని వివరించారు. అలాంటి వారితో స్నేహపూర్వకంగా.. మర్యాదగా మాట్లాడి వారిని గమ్యస్థానానికి తీసుకుని వెళ్లి తీసుకొని రావాలన్నారు. అంతేకాకుండా నగరంలో ఎక్కడపడితే అక్కడ ప్రయాణికులను ఎక్కించుకోరాదని ఎక్కడ స్థాపింగులు ఉన్నదో అక్కడే ఆటోలను ఆపి క్రమ పద్ధతిలో ప్రయాణికులను ఎక్కించుకోవాలన్నారు. అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తప్పు అన్నారు. రా ష్ .డ్రైవింగ్ చేయడంతో పాటు ఆటోలో నడుపుతూ సెల్ఫోన్లు మాట్లాడడంతో పాటు డీజేలు పెట్టుకోవడం మద్యం సేవించి ఆటోలో నడుపును లాంటివి చేయరాదన్నారు. అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బీమా లేకపోతే ప్రమాదం జరిగిన వ్యక్తికి గాని వాహనం గాని ఎలాంటి బీమా వర్తించదన్నారు. గతంలో ఈ . చలానా ద్వారా జరిమానా విధించబడిన వాహనాలకు వీలైనంత త్వరగా జరిమానాలను చెల్లించి ఆదనపు జరిమానాకు గురికాకుండా వాహనదారులు ఈ.చలానా ను చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ లు భాస్కర్ రెడ్డి. శ్రీనివాసులు. ట్రాఫిక్ ఎస్ఐలు షేక్షావల్లి. పాల్గొన్నారు.