శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ 45 సంవత్సరాల పైబడిన నాయి బ్రాహ్మణులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని శ్రీకాళహస్తి పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం ఆయన పట్టణంలోని ఎంజీఎం హాస్పిటల్ నందు కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ సురక్షితం రెండో దశ ప్రారంభం కానున్న తరుణంలో వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు వేసుకోవాలని తెలిపారు. కరొనా పట్ల ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. తప్పనిసరిగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. సమాజంలో ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వారి శరీర స్పర్శ తో ప్రజలకు సేవ చేస్తున్న నాయి బ్రాహ్మణులు అందరూ వ్యాక్సిన్ ప్రభుత్వం నిర్దేశించిన టేక్ వేయించుకోవడం అత్యంత అవసరమని చిత్తూరు జిల్లా నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం నాయకులు చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement