Saturday, November 23, 2024

వ్యాక్సిన్ సురక్షితం – అదనపు కమిషనర్ హరిత

తిరుపతి, కోవిడ్ 19 వ్యాక్సిన్ ఎంతో సురక్షితం. 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ టీకా వేయించుకోవాలని అదనపు కమిషనర్ హరిత తెలిపారు. గురువారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో పదో వార్డు వార్డు సచివాలయం లో కోవిడ్ -19 కరోనా వ్యాక్సిన్ టీకా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ , జిల్లా కలెక్టర్, నగర పాలక సంస్థ కమీషనర్ గిరీష ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ టికా వేసే ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించాలన్నారు. నగరంలో 45 సంవత్సరాలు పైబడిన వారు లక్షమంది ఉన్నారని వారందరికీ 30 రోజుల్లో టికా వేయించే ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వార్డు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి 45 సంవత్సరాలు పైబడిన వారందరిని గుర్తించి నగరంలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లలో (రిజిస్ట్రేషన్) నమోదు చేసుకొని వారికి టీకా వేయించే పనిలో ఉంటారన్నారు. టీకా తీసుకున్నవారు సురక్షితంగా ఉండేదానికి డాక్టర్లు సూచనలు పాటించాలన్నారు. ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ నేడు 5472 మంది వారి పేర్లు నమోదు చేసినట్లు చెప్పారు. వారందరికీ హెల్త్ అధికారులు, హెల్త్ సెక్రటరీలు తదితరులు పాల్గొని వారికి వ్యాక్సిన్ టికా వేసుకుని విధంగా చర్యలు తీసుకుంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో డి.యస్.ఓ. నీలకంటేశ్వర రావు, మోహన్, సూపర్డెంట్ రామచంద్ర రావు, హెల్త్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement