ప్రజలు అప్రమత్తం గా ఉండాలి.
వ్యాక్సినేషన్ పట్ల అపోహలు వీడండి
48,800 మందికి వాక్సిన్ వేశాం
ఎన్నికల ప్రచారాల్లో కోవిడ్ నిబంధనలు పాటించండి
వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడండి
తిరుపతి – కోవిడ్ 19 సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువ గా ఉందని, నగరంలోని ప్రజలందరూ తప్పక మాస్క్ ధరించి, శానిటైజర్ వినియోగిస్తూ, సామాజిక దూరం పాటించాలని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా నగరప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం నగరపాలక సంస్థ సమావేశం మందిరం నందు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నామన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటికి 1208 కేసులు ఉన్నాయన్నారు. వారంలో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. నగరంలో కోవిడ్ వాక్సినేషన్ చేపడుతున్నామన్నారు. 45 సంవత్సరాలు దాటిన వారు లక్షా ఇరవై వేల మంది ఉండగా 48,800 మంది కి వ్యాక్సిన్ వేసామన్నారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదన్నారు. అపోహలు వీడి అందరూ వాక్సినేషన్ చేయించుకోవాలన్నారు. 11 నుండి 14 వ తేదీ వరకుటీకా వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. టీకా వారోత్సవాల లో 30 నుంచి 40 వేల వరకు వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. సచివాలయంలో కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. పి.హెచ్.సి.లో కూడా అందిబాటులో ఉందన్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన వారు ట్రయాజిన్ టెస్టు చేసుకోవాలన్నారు. .అలసత్వం వహిస్తే ప్రాణాలకు ప్రమాదమన్నారు. పల్స్ ఆక్సీ మీటర్ ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకుని జాగ్రత్త పడాలన్నారు. పాజిటివ్ వచ్చి సింటమ్స్ లేకున్నా 7 నుంచి 15 రోజులు హోం ఐసోలేషన్ లో ఉండాలన్నారు. హోం ఐసోలేషన్ లో ఉండే వారికి కిట్ లు ఇస్తున్నామన్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే ఎదో జరుగుతుందని , అపోహాలకు పోకుండా, అందరూ వాక్సిన్ వేయించుకోవాలన్నారు. కర్ఫ్యూ విధించడం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉంటుందన్నారు. 12 వేల డోసుల టీకా అందుబాటులో ఉందని, రోజుకు 2 వేల నుండి 2,500 మందికి వాక్సినేషన్ చేస్తామన్నారు. వాలంటీర్లు ఇండ్ల వద్దకు వెళ్లి 45 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి వాక్సిన్ వెయిస్తున్నామన్నారు. చెన్నై, బెంగళూరు వంటి సిటీల్లో పనిచేసేవారు తిరిగి వస్తుండడం వలన కూడా కేసులు పెరుగుతున్నట్లు గుర్తించామని, వారి ద్వారా వ్యాపించకుండా తగు చర్యలు చేపట్టామన్నారు. వారిని హోమ్ క్వారంటేన్ చేస్తున్నామన్నారు.
ఓటు మనందరి హక్కు.. అందరూ ఓటు వేయండి
ఓటు మనందరి హక్కు అని, ఉప ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కమిషనర్ గిరిష అన్నారు. మీ చుట్టూ పక్కల వారు కూడా ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రచారాల్లో ఎక్కువ మంది పాల్గొంటున్నారని, అందరూ విధిగా మాస్క్ ధరించాలన్నారు. పోలింగ్ రోజు కూడా అందరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించాలన్నారు. పోటీలో ఉన్నవారూ, ప్రచారంలో పాల్గొనే వారు, ఓటు హక్కు వినియోగించుకునే వారు అందరూ కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. కోవిడ్ నిభందనలు పాటించకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే కొంతమందికి ఫైన్ కూడా వేయడం జరిగిందన్నారు. ఓటర్ స్లిపుల పంపిణీ జరుగుతోందని, రెండు మూడు రోజుల్లో.పూర్తవుతుందన్నారు.
రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఎవ్వరు అనవసరంగా బయట తిరగకుండా ఇంట్లోనే ఉండాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు ఎక్కువగా నీరు, మజ్జిగ , పండ్లు వంటివి తీసుకోవాలన్నారు. దోమలు కూడా పెరిగే అవకాశం ఉందని ప్రతి శుక్రవారం డ్రైడే పాటిస్తే మంచిదన్నారు. ఎక్కువ రోజులు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. తద్వారా డెంగ్యూ వంటి విష జ్వరాలు రాకుండా ఉంటాయన్నారు.