Friday, November 22, 2024

ప్రజలు అప్రమత్తంగా ఉండండి…

శ్రీకాళహస్తి – పట్టణ ప్రజలు కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ యానాది సంఘం ఆధ్వర్యంలో ప్ర‌చురించిన క‌ర‌ప‌త్రాల‌ను శ్రీకాళహస్తి డి.ఎస్.పి విశ్వనాధ్ శ్రీకాళహస్తి మున్సిపాలిటీ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్ లు ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కరోనా వైరస్ సెకండ్ వే చాలా ప్రమాదకరంగా సోకుతుందని . ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. అనవసరంగా బయట తిరిగి వద్దని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సామాజిక భద్రత సామాజిక దూరం పాటిస్తూ శాన్ టేజర్ వాడాలని కోరారు. అనవసరంగా ఎవరు తిరగ రాదని గాల్లోనే వైరస్ ప్రభావం అధికంగా ఉందని అనవసరమైన పనులు పెట్టుకుని బయట తిరిగితే కరోనాకు గురికాక తప్పదని తెలిపారు . కరొన వైరస్ అరికట్టడానికి ప్రతి ఒక్కరు కరోనా వైరస్ ఇంజక్షన్ వేయించు కోవాలని కోరారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రభుత్వ మండల పి హెచ్ సి సెంటర్లులో ప్రతి ఒక్కరికి కోవిడ్ ఇంజక్షన్ ఉచితంగా వేస్తున్నట్లు తెలిపారు .ఈ కార్యక్రమంలో సంస్త ప్రతినిధి చందమామల కోటయ్య, జనమాల గురవయ్య, హరి కిరణం అధినేత పసుపులేటి హరి ప్రసాద్, చిటత్తూరు సర్పంచ్ రాపూరు కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement