Friday, November 22, 2024

అపార్ట్ మెంట్ పై నుంచి పడి కూలీ మృతి

తిరుపతి సిటీ : తిరుపతి ఆధ్యాత్మిక నగరం. ఇక్కడ రోజు రోజుకి అభివృద్ధి చెందటంతో భవనాలు కూడా శరవేగంగా కట్టడాలు జరుగుతున్నాయి. దానికి తోడు అపార్ట్ మెంట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడికి ఉపాధి కోసం వివిధ జిల్లాల నుంచి జీవనం సాగించేందుకు వస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా భవనాలపై నుంచి కూలీలు పడి మృతిచెందిన సంఘటనలు అనేకంగా ఉన్నాయి. తిరుపతి నగరంలోని స్థానిక బైరాగి పట్టెడ వద్ద రమణారెడ్డి అపార్ట్ మెంట్ ను నిర్మిస్తున్నారు.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డి గ్రామ హరిజనవాడకు చెందిన హనుమంతు (32). అపార్ట్ మెంట్ వద్దకు సిమెంట్ కలిపేందుకు కూలీకి వెళ్లడం జరిగింది. 5వ అంతస్తుల భవనం నుంచి ఇసుక తోసిమెంట్ మాలు కలిపిన దానిని ఇనుప.స్టాండ్ లో తీసుకుని వెళ్తూ ఉండగా 5వ‌ ఫ్లోర్ నుండి గుంతకు వదిలిన గుంతలో పడి మృతి చెందడం జరిగింది. ఇతను 10 సంవత్సరాల క్రితం మేరీ ఆమెను వివాహం చేసుకున్నారు. ఇతనికి ఒక కుమారుడు ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తాము రెక్కాడితే కానీ డొక్కాడని కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నామని.. తమకు వేరే జీవనాధారం లేదని. త‌మ అత్త కూడా త‌మ భర్త పైన జీవనం సాగిస్తున్నామని కంటతడి పెట్టారు. తాము జీవనాధారం కోల్పోయామని కన్నీటి పర్వతయ్యారు. దీనిపై ఎంఆర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ఎస్వి మెడికల్ కళాశాలకు తరలించారు.
నిత్యం ప్రమాదాలు :
తిరుపతి నగరంలో ఇటీవల కాలంలో అపార్ట్ మెంట్ల వద్ద భవనాల వద్ద కూలీలు ఇటీవల మృతి చెందుతున్నారు. కూలీలకు కార్మిక శాఖ తరపున వచ్చేటువంటి బీమాపై కూడా అవగాహన లేకపోవడంతో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. మరోపక్క కొంతమంది అపార్ట్ మెంట్ వాసులు భవన యజమానులు ఎంతోకొంత వారి కుటుంబానికి ఇచ్చి కేసులు లేకుండా చేతులు దులుపుకునే సంఘటనలు కూడా అనేకంగా ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement