Sunday, November 3, 2024

వైకుంఠపురం కూరగాయల మార్కెట్ ను త‌నిఖీ చేసిన న‌గ‌ర క‌మిష‌న‌ర్

తిరుపతి – ముత్యాల రెడ్డి పల్లి, వైకుంఠ పురం పార్క్ వద్ద నిర్మించిన కూరగాయల మార్కెట్ను గురువారం అధికారులతో కలసి కమిషనర్ గిరీష పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ వేసవిలో దృష్టిలో ఉంచుకొని మార్కెట్ లో వినియోగదారులకు, కొనుగోలుదారులకు త్రాగునీరు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. మార్కెట్ పరిసరాల ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలని ఇంజనీరింగు, శానిటరీ అధికారులను ఆదేశించారు. కూరగాయల మార్కెట్ వినియోగదారులతో కమిషనర్ మాట్లాడుతూ గత సంవత్సరం అక్టోబర్ లో మార్కెట్ ని ప్రారంభించడం జరిగిందని, ప్రజల సౌకర్యం కోసం ఇక్కడ అ మార్కెట్ను నిర్మించడం జరిగిందని, అన్నమయ్య మార్గం రైతుబజార్, తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ కు దూరంగా ఉందని గతంలో ఇక్కడున్న ప్రాంత వాసులు ఇబ్బందిగా ఉందని, ప్రతిసారి ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతుందని తన దృష్టికి తీసుకొని వస్తే, వారి కోసం ఇక్కడ శాశ్వతంగా కూరగాయల మార్కెట్ నిర్మించినట్లు తెలిపారు. ప్రతి షాపు వాళ్లు కోవిడ్ నిబంధనలు పాటించాలని, ప్రతి షాపు వద్ద శానిటైజర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కొనుగోలుదారులు మాస్కు ఉంటేనే అనుమతించాలని, మార్కెట్ పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలన్నారు. కమిషనర్ వెంట సూపర్డెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ లు చంద్రశేఖర్, వెంకట్ రామ్ రెడ్డి, శానిటరీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement