Tuesday, November 26, 2024

కోవిడ్ సేవల‌పై ప్రజల్లో నమ్మకం తీసుకురండి …జిల్లా కలెక్టర్ హరినారాయణన్

చిత్తూరు – జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో కోవిడ్ సేవలు బాగా అందిస్తారనే నమ్మకాన్ని తీసుకురావాలని, అప్పుడే చిత్తూరు పట్టణానికి మంచి పేరు వస్తుందని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల, అపోలో లో గల కోవిడ్-19 వార్డును జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సంధర్భంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో నూతనంగా సిద్దం చేసిన కోవిడ్-19 వార్డును కలెక్టర్ సందర్శించి అన్ని గదులను పరిశీలించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ , ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్, సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, జనరల్ సర్జరీ వార్డులను సందర్శించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో కోవిడ్ సేవలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరం మేరకు బెడ్ల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు కోవిడ్ సేవలు ఎక్కడ అందిస్తారని తెలియజేసే బోర్డు ను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్యులు, వైద్య సిబ్బంధి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కోవిడ్ రోగులకు డాక్టర్లు ఎప్పటికప్పుడు మెరుగైన వైద్య సేవలు అందిస్తుండాలన్నారు.కోవిడ్ నోడల్ ఆఫీసర్ల కాంటాక్ట్ ఫోన్ నెంబర్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం, డి.ఎం.హెచ్.ఓ డాక్టర్ పెంచలయ్య, డి.సి.హెచ్.ఎస్ డాక్టర్‌ సరళమ్మ, చిత్తూరు ప్రభుత్వ ప్రదాన వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కుమార్ , ఆర్ఎంవో డాక్టర్ సంధ్య , చిత్తూరు కోవిడ్ ఇంఛార్జ్ డాక్టర్ మహేష్ , అపోలో యూనిట్ హెడ్ నరేశ్ రెడ్డి, డాక్టర్లు, నర్సులు సిబ్బంధి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement