తిరుపతి, – జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ జిల్లా జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) వి.వీర బ్రహ్మo లు శనివారం మధ్యా హ్నం బర్డ్ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు…ఈ సందర్భంగా బర్డ్ ప్రత్యేక అధి కారి డా.రాచ పల్లి రెడ్డప్ప రెడ్డి హాస్పటల్లో కొవిడ్ రోగులకు అందుతున్న సేవలను కలెక్టర్ కి వివరించారు.. ఆసుపత్రిలో 150 పడకలను కోవిడ్ పేషెంట్స్ కు సేవలందించేందుకు టి టి డి కేటాయించిందని తెలిపారు.. అలాగే ఆక్సిజన్ కు సంబం ధించి 1 కిలో లీటర్ల నిల్వ సామర్థ్యం ఉన్న దానిని 6 కిలో లీటర్ల నిల్వ సామర్థ్యం ట్యాంక్ గా పెంచడం ద్వారా నిరంతర ఆక్సిజన్ సరఫరా చేయవచ్చని చెప్పారు… ఆక్సిజన్ అందుబాటులో ఉండటంతో కోవిడ్ బాధి తులకు వైద్య సేవలు మరింత మెరుగా అందించేందుకు అవకాశం ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎం ఓ డా.కిశోర్, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ కె ఎస్ ఆర్ శేష శైలేశా, డా.వేణు గోపాల్, డా.శుభశ్రీ,డా.దీపక్,డా.రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement