చిత్తూరు- కోవిడ్ నియంత్రణలో భాగంగా క్షేత్ర స్థాయిలో గ్రామ ,వార్డు కమిటీల పాత్ర కీలకమని , వారందరూ మరింత సమర్థ వంతం గా పనిచేసేలా నియోజ క వర్గ ప్రత్యేక అధికారు లు, నోడల్ అధికారులు దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారా యణన్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ నందు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్లు వి. వీరబ్రహ్మం, ఎన్. రాజశేఖర్, మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, చిత్తూరు, తిరుపతి ఆర్డిఓ లు రేణుక, కనక నరసారెడ్డి, ఇతర సంబంధిత నియోజక వర్గ ప్రత్యేక అధికారు లు, నోడల్ అధికారుల తో ఫీవర్ సర్వే, హోమ్ క్వారంటైన్, కాంటాక్ట్ ట్రేసింగ్, ట్రయాజింగ్, హోమ్ ఐసోలేషన్, కోవిడ్ కేర్ సెంటర్ల నిర్వహణ, కోవిడ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, ఆక్సిజన్ మేనేజ్మెంట్, హెల్ప్ డెస్క్ నిర్వహణ, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, ఇతర సంబంధిత అంశాల పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ ఫీవర్ సర్వేలో భాగంగా ఆశా, ఏఎన్ ఎం లు ఇంటింటి సర్వే నిర్వహించి కోవిడ్ లక్ష ణాలు ఉన్నవారిని గుర్తించి తగు పరీక్షలు నిర్వహించాలని అన్నారు. హోమ్ ఐసో లేషన్, హోమ్ క్వారం టైన్ లో ఉన్నవారు బయట తిరగ కూడ దని…ప్రజలు బయటకు వచ్చే సమయంలో విధి గా మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటిం చడం… గుంపులు గా ఉండరాదనే విష యాన్ని మైకులు మరి యు దండోరా ద్వారా ప్రజల్లో విస్తృత అవ గాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.టెస్టింగ్, ట్రెసింగ్, శ్యాంపుల్ కలెక్షన్ పై నోడల్ అధి కారులు ప్రత్యేక శ్రద్దతో పని చేయాలని తెలి పారు.జిల్లా వ్యాప్తంగా ఏయే పి.హెచ్.సి గ్రా మాల పరిధిలో ఎక్కువ కేసులు నమోధవుతు న్నాయో ఆ ప్రాంతంలో మొబైల్ టెస్టింగ్ బృం దాల ద్వారా శ్యాంపుల్ కలక్షన్ ను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఫీవర్ సర్వే పక్కాగా చేయాలని, కాంట్రాక్ట్ ట్రేసింగ్ బృందాలు చురుగ్గా పనిచేయాలని ఉన్నారు. కోవిడ్ కేర్ సెంటర్ లలో మాస్కులు, పి.పి.కిట్లు, జనరేటర్, ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితుల పై ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుని అవసరం అయితే ఆసుపత్రులకు తరలించాలని తెలి పారు. కోవిడ్ మేనే జ్మెంట్ లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అడ్మిషన్లు డిశ్చార్జ్ ల పై పర్యవేక్షణ చేయాలని, ఆక్సిజన్ అవసరం ఉన్న వ్యక్తులకు ఆక్సిజన్ బెడ్ల కేటాయింపులో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఆక్సిజన్ మేనేజ్మెంట్ కు సంబంధించి ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వ, సరఫరా సామర్థ్యాల పై మరియు అవసరాల మేరకు ఆక్సిజన్ సరఫరా అంశాలకు సంబంధించి ప్రతి రెండు గంటలకు ఒక సారి నివేదికను సమర్పించాలని ట్రైనీ కలెక్టర్, జిఎం డిఐసి లను ఆదేశించారు. వైద్య సిబ్బందికి అవసరమైన మాస్క్ లు, స్యానిటైజర్లు, పి పి ఇ కిట్ల పంపిణీ చేయాలని, హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి అందించే కిట్లను జిల్లాలోనే 10 వేల కిట్లను సిద్ధం చేసే ప్రకీయ ను వేగంగా చేయాలని ఏపిఎండిఐసి ధనుంజయ రెడ్డిని ఆదేశించారు. 104 కాల్ సెంటర్ల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ కు అందే ఫిర్యాదుల పై ఎప్పటికప్పుడు స్పందించాలని ట్రైనీ కలెక్టర్ కు సూచించారు. పాజిటివ్ కేసులను తరలించేందుకు 104, 108 వాహనాలతో పాటు కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా అవసరమైన అంబ్యులెన్స్ ల ఏర్పాటు పై నోడల్ అధికారి లోకవర్ధన్ మరియు బసిరెడ్డిలు స్పందిచాలని కలెక్టర్ ఆదేశించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement