చిత్తూరు జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో క్రూర జంతువుల సంచారంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. కాకినాడ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలో పలు చోట్ల పెద్దపులి సంచరించిన విషయం తెలిసిందే. గ్రామస్థులతోపాటు అధికారులు సైతం పులిని పట్టుకునేందుకు చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో మరోషాక్ తగిలింది.
తాజాగా చిత్తూరు మండలం వి.కోట మండలం నాయకనేరి గ్రామంలో చిట్టిబాబు అనే రైతుకు చెందిన ఆవును చిరుతపులి చంపివేసింది. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు గ్రామానికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆవును చిరుతే చంపిందని ధ్రువీకరించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.