శ్రీకాళహస్తి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళు ఆకాశాన్ని అంటు-తున్నాయని, ఆ కళ్ళు కిందకు దిగాలంటే తిరుపతి పార్లమెంటు- ఉప ఎన్నికల్లో ఓటే ఆయుధంగా పనిచేస్తుందని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి లోక్‌సభ పార్లమెంటు- ఉప ఎన్నికల సందర్భంగా శ్రీకాళహస్తి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలంటే టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి ఓటు- వేసి, గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి అప్పులు ఇచ్చే పరిస్థితిలో బయట వ్యక్తులు లేరని. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన జగన్‌కు లేదని, దోచుకున్న, దాచుకున్న అనే రీతిలో పాలన చేస్తున్నారే తప్ప, రాబోయే తరానికి మన రాష్ట్రం ఇచ్చే వనరులు ఏమిటి అనే ఆలోచన కనీసం లేకపోవడం సిగ్గుచేటన్నారు. రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి ఏ ఒక్క పరిశ్రమైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు నాడు రాష్ట్ర విభజన సమయంలో లోటు- బడ్జెట్ ఉన్నప్పటికీ ఏ ఒక్క కార్యక్రమం ఆపలేదని. పేద ప్రజల కోసం అన్నా క్యాంటీ-న్లు ఏర్పాటు- చేశాిమన్నారు. నాణ్యమైన ఇల్లు పేదలకు నిర్మిస్తే వాటిని ఇవ్వలేని పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.
ముసుగు దొంగలొస్తారు తస్మాత్ జాగ్రత్త..
చేతిలో రెండు బుడ్డీలు పెట్టి రెండు వేలు డబ్బులు పెట్టి మీ అమూల్యమైన ఓటు- వేయాలని చేతులు పట్టు-కొని వేడుకుంటారు అని అలాంటి వారితో కఠినంగా ఉండాలని మద్యం డబ్బులకు అమ్ముడు పోతే మన జీవితం నాశనం అవుతుందని గుర్తు చేశారు. ప్రజల్లో మార్పు రావాలి.. నాడు పాదయాత్ర ద్వారా ఒక్క అవకాశం ఇవ్వండి నవరత్నాలు అందిస్తున్న మహా నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని ఇస్తున్న నవరత్నాలు ఇస్తూ మరో పక్క చేతి కి తీసుకుంటు-న్నారని ప్రశ్నించారు. అమ్మఒడి ద్వారా పది వేలు ఇచ్చి నాన్న ద్వారా సంవత్సరానికి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు. నాసిరకం మద్యం అమ్మకాలు చేస్తూ లక్షల కోట్లు- సంపాదిస్తున్నారని, గత ప్రభుత్వంలో అన్ని రకాల మద్యం బ్రాండ్ లు ఉండేవని ఈ ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు జరుగుతున్నాయని ఇది మన రాష్ట్ర పరిస్థితి అని తెలిపారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని తిరుపతి విమానాశ్రయంలో 10 గంట లపాటు- కూర్చొని పెట్టిన ఘనత వైసిీపీ సర్కారేకే దక్కిందని, పాలన శాశ్వతం కాదని, ఇది గమనించాలన్నారు
జవాబుదారీతనంతో పనిచేసే పార్టీ టీడీపీ
రాష్ట్ర విభజన సమయంలో అన్ని ప్రాంతాలను పరిశీలించి అన్ని వనరులు ఉన్న అమరావతి ఎంచుకొని అభివృద్ధి చేయాలనే తపనతో శరవేగంగా పనులు చేస్తుంటే అర్ధాంతరంగా ఆపి సుమారు లక్ష కోట్లు- పూర్తిగా నాశనం అయ్యే విధంగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కడపలో స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి భూమి పూజ చేస్తే మళ్లీ ఇంకో సారి భూమిపూజ చేసి పనికిమాలిన కంపెనీకి -టె-ండర్లు ఇవ్వడం జరిగిందని రెండు సంవత్సరాల పాలనలో ప్రజలు విసిగి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం పూర్తిగా ఎత్తు పోయే పరిస్థితి ఏర్పడింది, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ఏమవుతుందో తెలియని పరిస్థితి, 17 వేల కోట్లతో రైతులకు రుణ మాఫీ చేసిన ఘనత టిడిపితోనే జరిగిందని అలాంటి రైతులకు ఇప్పుడు మీటర్ల బిగించి బిల్లులు వసూలు చేయడం ఎంతవరకు సబబో తెలపాలన్నారు.ప్రజలే టిడిపికి పట్టు-కొమ్మని అడిగేవారు కాదు పని చేసేవారు కావాలని ని కావున ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు- వేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి సమన్వయకర్త బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మండల అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మనిషిని దేవుడితో పోల్చడం తగదు..
అంతుకుముందు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు దర్శించుకున్నారు. టీడీపీలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం తిరుపతి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ, నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత, తిరుపతి లోక్‌సభ అభ్యర్ధి పనబాకలక్ష్మితో కలసి తిరుమల చేరుకున్న చంద్రబాబు నాయుడు, సంప్రదాయ దుస్తులు ధరించి వైకుంఠం క్యూ కాంప్లెక్సు గుండా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ, జగన్‌ను విష్ణుమూర్తిగా పోలు స్తూ రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా మండి పడ్డారు. శ్రీవారి దయవల్లే తాను మావోల దాడినుంచి బయటపడ్డానని చంద్రబాబు అన్నారు.
బూత్ కన్వీనర్లతో భేటీ
దర్శనం అనంతరం స్థానికుల నివశించే బాలాజినగర్‌కు చేరుకోగా స్థానిక మహిళలు బాబుకు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి బాబు నేరుగా టీడీపీ కార్యకర్త రాజుయాదవ్ ఇంటికి చేరుకుని తిరు పతి లోక్‌సభ ఉప ఎన్నికలపై బాలాజీనగర్ బూత్ కన్వీనర్లతో సమావేశ మయ్యారు. కార్యకర్తలే పార్టికి వెన్నుదన్నులని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చి, టీడీ పీ కార్యకర్తలో జోష్ నింపే ప్రయత్నం చేశారు.అనంతరం మరో కార్యకర్త కేశవులు ఇంటికి వెళ్లి కొద్దిరోజుల క్రితం ఆయన తల్లి మృతి చెందడంతో కేశవుల కుటుంబ సభ్యులను పరామ ర్శిం చారు. అనంతరం తిరుపతికి ప్రయాణమయ్యారు.