Friday, November 22, 2024

ముద్దులు పెట్టి పిడిగుద్దులు గుద్దుతున్నాడు…. జగన్ పై చంద్రబాబు విమర్శలు

నాది అభివృద్ధికి ఆరాటం…వాళ్ళది వ్యక్తిగత ఆదాయం కోసం ఆర్భాటం
మధ్య నిషేధం అన్నాడు అత్యధికంగా సొంత బ్రాండ్లు అమ్ముతున్నారు
ఒక్క అవకాశం ఇచ్చారు…అభివృద్ధిని అడ్డుకున్నారు
నాకు పదవి కొత్త కాదు..దానికోసం అరాటపడలేదు

సత్యవేడు,- ‘ఒక్క అవకాశం ఒక్కఅవకాశం అని కనిపించిన వాళ్ళకి ముద్దులుపెట్టి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది పిడిగుద్దులు గుద్దుతున్నాడు’ అంటూ  సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షనాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శల వర్షం కురిపించారు. తిరుపతి ఉపఎన్నికల్లో భాగంగా సత్యవేడు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈసంధర్భంగా సత్యవేడుకు వచ్చిన అధినేతకు పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికి సాయిబాబా ఆలయంలో పూజలు చేసి ర్యాలీగా సభవేధిక వద్దకు వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్క అవకాశం తీసుకున్న వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడన్నారు. ఆసియా కాండంలో అభివృద్ధికి చిరునామాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను నామరూపాలు లేకుండా చేశాడన్నారు. తాను అడుగుబయట పెడితే రాళ్లదాడి చేయించడం, పవర్ కట్ చేయించడం ఆనవాయితీగా పెట్టుకున్నారని అలాంటివాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు. త‌న‌కు పదవి దాహం లేదని దానికోసం తాను పాకులడడం లేదని ఆయన పేర్కొన్నారు. త‌న‌ ధ్యాస, శ్వాస రాష్ట్ర అభివృద్ధేన్నని నాడు హైదరాబాద్ అభివృద్ధి చేసినట్లుగానే ఆంధ్రప్రదేశ్ ను చెయాలని సంకల్పించాను. విభజన అనంతరం రాత్రి పగలు కష్టపడి పనిచేసి శ్రీసిటీ పారిశ్రామికవడలో 90 పరిశ్రమలు ఏర్పాటు చేశామన్నారు. వాటితో పాటు హీరో, అపోలో పరిశ్రమలు  బెంగుళూర్, చెన్నై వైపు చూస్తున్నప్పుడు పోరాడి ఒప్పించి ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. సత్యవేడు ను 40 సంవత్సరాలుగా చూస్తున్నా పార్టీ కార్యకర్తల్లో ఏమాత్రం ఉత్సాహం తగ్గలేదని ఇదే ఉత్సాహంతో పనిచేసి ఎంపీ అబ్యర్ధిని గెలిపించాలన్నారు. సురుటు పల్లి, నందనం ఇసుక రిచ్లల నుంచి తమిళనాడుకు తరలిస్తున్నారు. పోలీసులు చూస్తూ ఉన్నారు తప్ప చేసిందేమి లేదు. ఇలాంటి పోలీసులను ఎవరిని వదిలి పెట్టేదిలేదని హెచ్చరించారు.  ఇంటిఇంటికి రేషన్ సరఫరా అన్నాడు వీధిలో నిల్చోబెట్టాడు, త్వరలో మద్యం కూడా ఇంటికి సరఫరా చేస్తామంటారు. ఆయనకు రాష్ట్ర అభివృద్ధితో పనిలేదు ఆయన సొంత ఖజానా నింపుకునేందుకు కష్టపడుతున్నాడు. సిమెంట్ ఫ్యాక్టరీ అభివృద్ధి కవాలి, ఖనిజ సంపదంత దోచుకోవాలి అందుకు ఆయన అనుచరులు కడప రెడ్లు అన్ని జిల్లాల్లో మకాం వేశారు ఎక్కడిక్కడ దోచుకుంటున్నారు. జిల్లాలో జరుగుతున్న ఇసుక దోపిడీల వెనక చిత్తూరు పెద్దారెడ్డి ఉన్నాడని, ఆదోపిడిలకు స్థానిక ఎమ్మెల్యే కూడా సహకరిస్తున్నట్లు సమాచారం వస్తుందన్నారు.  సత్యవేడుకు మరో ఎమ్మెల్యేగా ఆదిమూలం కొడుకు హీరోగా మారాడని  ఆయన ఓవరక్షన్ ఎక్కువవుతుందన్నారు.  వాలంటీర్లు వ్యవస్థ తీసుకొచ్చి ఏదో ఉద్ధరిస్తానన్నాడు. ఆయన్ని, ఆయన పార్టీని బ్రతికించుకునేందుకు వాళ్ళని వాడుకుంటున్నారు. అలాంటి వ్యవస్థలో ఉన్నవాళ్లకు భయపడాల్సిన పనిలేదు. నేడు అన్ని రకాల చార్జీలు పెంచేశారు. పెదవాళ్లకు ఆన్నీ చేస్తున్నమంటున్నారు వాళ్లు చేస్తుంది గోరంత చెప్పుకునేది దోచుకునేది కొండంత అని ఆయన దుయ్యబట్టారు. ఇలంటి వాటిని అడ్డుకోవాలన్నా, రాష్ట్రా ప్రయోజనాలకోసం పనిచెయ్యలన్న పనభాక లక్ష్మిని గెలిపించాలని పిలుపునిచ్చారు.ఎంపీ అభ్యర్థి పనాబాక లక్ష్మి,ఎమ్మెల్సి బుద్ద వెంకన్న, జగదేశ్వర రావు, మాజి ఎమ్మెల్యే శ్రావణ కుమార్, సత్యవేడు ఎన్నికల ఇంచార్జి గొర్రెల శ్రీధర్,మాజి ఎమ్మెల్యే హేమలత, సత్యవేడు ఇంచార్జి జేడీఆర్ కుమార్తె మౌనిక తదితరులు వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement