తిరుపతి సిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా బుధవారం తుడా ఆఫీస్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. అక్కడ వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా కోఆర్డినేటర్.నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి చేతులమీదుగా కేక్ ను కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి సుమారు 1500 మంది రక్తదానం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రక్తం కృత్రిమంగా దొరికే వస్తువు కాదని, రక్తదానం చేస్తే నలుగురికి ప్రాణదానం చేసినట్లు అని తెలియజేశారు.
ప్రతి ఒక్కరూ సంవత్సరానికి మూడుసార్లు రక్తదానం చేయవచ్చన్నారు. రక్తదానంపై అపోహలు వీడాలన్నారు. రక్తదానం చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన్ అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్ర రెడ్డి, గంగమ్మ గుడి చైర్మన్ కట్ట గోపి యాదవ్, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు ఆంజనేయులు, ఎస్.కే.బాబు అమర్నాథ్ రెడ్డి.. కో ఆప్షన్ సభ్యులు రుద్రరాజుశ్రీదేవి, నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్.రెడ్డి, వైఎస్ఆర్సిపీ పార్టీ నాయకులు దొడ్డ రెడ్డి సిద్ధారెడ్డి, నారపరెడ్డి రాజిరెడ్డి, పాల్గొన్నారు.