Friday, November 22, 2024

కొవిడ్ పై అవ‌గాహ‌న‌కు తిరుప‌తిలో క్యాండిల్ ర్యాలీ…

తిరుపతి, – కొవిడ్ పై తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌ల కోసం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష ఆధ్వర్యంలోగ‌త రాత్రి తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం ప్రాంగణం నుండి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ గిరీష మాట్లాడుతూ కోవిడ్ వ్యాధి ప్రబల కుండా మాస్కు తప్పని సరిగా ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వాడటం మంచిది అని తెలియజేశారు, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకుండా ఉండటం లాంటివి పాటించాలని, ప్రజలందరూ కోరోనా వ్యాధి పై అవగాహన కలిగి ఉండాలని కోరినారు. అనంతరం తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం వైఎస్ఆర్ సమావేశం మందిరం నందు అధికారులతో కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని ప్రజలందరూ కోరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరు టీకాలు వేసుకునే విధంగా అవగాహన నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ హరిత, ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ సుధారాణి, వైద్య అధికారులు, ఆరోగ్య పర్యవేక్షకులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, మేనేజర్ హసిమ్, ఏ సీ పీ లు శ్రీనివాసులు, షణ్ముగం, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, గాలి సుధాకర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, ప్రకాష్, సూరిబాబు, రఫీ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement