వైఎస్ వివేకా హత్య కేసులో తన ప్రమోయం ఉందంటూ వస్తున్న ఆరోపణలను మరోసారి ఖండించారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి. వివేక హత్య కేసులో తన ప్రమేయం ఉన్నట్టు రుజువైతే ఉరిశిక్షకు సిద్ధమని సవాల్ విసిరారు. విజయమ్మ 25 నెలల తర్వాత నిద్రలేచి లేఖ రాశారని విమర్శించారు. వివేకా గుండెపోటుతో చనిపోయినట్టు ప్రకటించారని, 4 గంటల తర్వాత గుండెపోటు… గుండెలో పోటుగా మారిందన్నారు. పీకే ప్రణాళికలతో ఓట్ల కోసం జగన్, మమత నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీబీఐ దర్యాప్తు వద్దన్నారని గుర్తు చేశారు. చివరికి పవన్ కల్యాణ్ సినిమాపైనా కక్ష సాధించాలా? అని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement