Tuesday, November 26, 2024

భారత్ బంద్.. రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల బందోబస్త్ : ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి

తిరుపతి : భారత్ బంద్ సోమవారం పిలుపునివ్వడంతో తిరుపతి రైల్వే స్టేషన్ నందు పోలీసు బలగాలు 500 మంది చుట్టుపక్కల ప్రాంతాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మోహరించడం జరిగింది. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి సోమవారం ఆయన రైల్వే స్టేషన్ నందు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసుల ఏర్పాటు చేయడంతో పాటు నగరంలో ప్రధాన కూడళ్ళలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్, లాడ్జిలో వివిధ వాహనాలను విస్తృతంగా తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు ప్రధాన ప్రాంతాల్లో కూడా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రం ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో రోజు వస్తూ పోతూ ఉంటారు. ఏదైనా చిన్నపాటి సంఘటన జరిగినా దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం జరుగనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.. శాంతి భద్రతలకు భంగం కలగకుండా పోలీసులు. డేగ కన్ను వేశారు.. అలాగే బాడీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ మొబైల్ వాహనాలు విస్తృతంగా నగరంలో తిరుగుతూ బందోబస్తు పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కూడా అనుమానితులు కూడా ఎక్కడైనా ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. తిరుపతి జిల్లా పరిధిలో రేణిగుంట, గూడూరు రైల్వే స్టేషన్, పాకాల రైల్వే స్టేషన్ నుండి పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల అదనపు ఎస్పి ముని రామయ్య, ఈస్ట్ డి.ఎస్.పి మురళి కృష్ణ, ట్రాఫిక్ డిఎస్పి కాటంరాజు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement