Saturday, November 23, 2024

శ్రీ వాణి ట్రస్ట్ మీద దుష్ప్రచారం మానుకోండి : టీటీడీ పాలకమండలి సభ్యులు అశోక్ కుమార్

తిరుపతి సిటీ : శ్రీ వాణి ట్రస్ట్ మీద లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన ఇంటి వద్ద బైరాగి పట్టెడ వద్ద ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. మిడిమిడి జ్ఞానంతో కొంతమంది శ్రీ వాణి ట్రస్ట్ పై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఉపాధి కోల్పోతున్నారని కొందరు చెప్పడం సరికాదన్నారు. భక్తుల ఫిర్యాదు మేరకు ఇప్పటి వరకు 217 మందిని తిరుమలలో పోలీసులు అరెస్టు చేయడం జరిగిందన్నారు. 1377 మంది దళారులను తిరుమలకు నిషేధించారు. శ్రీ వాణి ట్రస్ట్ నగదు ఎవరి జేబులకు వెళ్లడం లేదన్నారు. వెనుకబడిన తరగతుల వారిప్రాంతాల్లో. 510 ఆలయాలు నిర్మించడం జరిగిందని వివరించారు. ఈనెల 9వ తేదీన అమరావతిలో ఆలయ నిర్మాణం కూడా ప్రారంభం కానున్నదని వివరించారు. తిరుపతి లో ఉన్న వ్యక్తులు పనిగట్టుకుని శ్రీవారి పై తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. కొంతమంది ప్రముఖుల ఏళ్ళు అయింది అందుకే స్వామివారికి సంబంధించిన కేసులను సేకరిస్తున్నారు. అలాంటి వారికి స్వామి తగిన బుద్ధి చెబుతారన్నారు. టీటీడీ లో ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. అనకాపల్లి లో జరిగిన ఘటన కూడా కొందరు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సిగ్గుచేటన్నారు. వైజాగ్ లో గ్యాస్ లీకేజీ జరిగిందని పై రాద్దాంతం చేయడం సరికాదన్నారు. ప్రజలు ఎలాంటి సౌకర్యాలు అందించాలి ప్రభుత్వం చూసుకుంటుందని ఇంకనైనా ప్రతిపక్షం విమర్శలు మానుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement