Friday, November 22, 2024

Tirumala: పోలీసులతో ఉద్యమాలను అణగదొక్కే ప్రయత్నం .. విష్ణువర్ధన్ రెడ్డి

తిరుమల : ప్రతిపక్షాల ఉద్యమాలను పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం అణగదోక్కే ప్రయత్నం చేస్తుందని ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ… బీమవరంలోని ఆలయంలో పూజారులపై వైసిపి నేతలు దాడులు చేసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. అన్యమతస్థులపై దాడులు జరిగితే ప్రభుత్వం ఇదే రితీలో స్పందిస్తుందా ? అని ప్రశ్నించారు. ఏపీ పోలీసులకు వైసిపి కార్యాలయం నుంచి జీతాలు ఇవ్వడం లేదన్నది పోలీసులు గుర్తించాలన్నారు.

పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి ఇవ్వలేదు… సీఎం జగన్ పూర్తి చెయ్యలేదన్నారు. అలాగే 14 సంవత్సరాలు అధికారంలో వున్నా చంద్రబాబు పూర్తి చెయ్యలేదన్నారు. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తే … బీజేపీ పూర్తి చేస్తుందన్నారు. వైసీపీ, టీడీపీ ఏపీలో మైండ్ గేమ్ ఆడుతున్నాయన్నారు. సోమువీర్రాజు మాట్లాడితే వైసీపీ అని, పురందేశ్వరి మాట్లాడితే టీడీపీ అంటున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ కేంద్రానికి ఫిర్యాదు చెయ్యడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి వాలంటీర్లపై భాధ్యత రావాలంటే 2.5 లక్షల మంది వాలంటీర్లను పర్మినెంట్ చెయ్యాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement