తిరుపతి సిటీ : అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలు ఇద్దరిని అరెస్టు చేసే వారి వద్ద నుంచి 50 లక్షల రూపాయలు విలువ కలిగిన 943 గ్రాముల బంగారు నగలతో పాటు మూడు కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పి పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముత్యాల రెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ అలిపిరి తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 10 ఇళ్ల జరిగిన దొంగతనాలు కేసుల్లో వీరిని అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు. విశాఖపట్నం కొత్త గాజువాక బి.సీ రోడ్డు బాపూజీ నగర్ కాలనీకి చెందిన అప్పారావు కుమారుడుసతీష్ రెడ్డి అలియాస్ కర్రీ సతీష్ 38 సంవత్సరాలు, నల్గొండ జిల్లా చిన్న పేట బాపం మోర్ తాండా. ఎ న్.బాబు. కుమారుడు నరేంద్ర అలియాస్ నారీ 26 సంవత్సరాలు వీరిని అరెస్టు చేసి వీరి వద్ద నుంచి 943 గ్రాముల బంగారు నగలు, మూడు కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అదే విధంగా మొదటి ముద్దాయి కర్రీ సతీష్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ విజయవాడ నెల్లూరు తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు 80 కేసులో ముద్దాయిలుగా ఉన్నారన్నారు. ఇతనిపై కూడా విశాఖపట్నం మూడవ అదనపు పోలీస్ స్టేషన్ నందు కె.డి ఉందన్నారు.. హైదరాబాద్ బంజారాహిల్స్ లో కూడా పి.డి కేసు కూడా నమోదు అయిందని పేర్కొన్నారు. సమావేశంలో క్రైమ్ అదనపు ఎస్పీ విమల కుమారి, డీఎస్పీ, సీఐలు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement