Friday, November 22, 2024

టీడీపీ విమర్శించడం తప్ప.. ఓట్లు అడగడం లేదు : ఎమ్మెల్యే భూమన

తిరుపతి సిటీ : తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నరే తప్ప ప్రజలను ఓట్లు అడగాలని కూడా మరిచిపోయారని ఎమ్మెల్యే . భూమన్ కరుణాకర్ రెడ్డి తెలియజేశారు. ఆదివారం తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక పంట వీధి. ఆకుతోట వీధి. పొర్ల వీధి . యాదవ్ వీధి, టీ.కే స్ట్రీట్, దొడ్డపురం వీధుల్లో ఇంటింటికి పర్యటించి విస్తృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లను గెలిపించాలని ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 20వ తేదీన జరగనున్న తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 మంది డైరెక్టర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలు నిర్ణయించు కున్నారన్నారు.

ప్రజలకు సిద్ధ శుద్ధితో సేవ చేయాలనే ఆలోచనతో ప్రజలు ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అవినీతి ద్రోహం మోసాలను ప్రజలు ఏనాడు గుర్తించారన్నారు కనుక వారికి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రానికి 14 సంవత్సరాలు పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిని పార్టీ దిస్థితి అగమ్య గోచరమన్నారు. ఈ కార్యక్రమంలో నగర్ డాక్టర్ శిరీష, టౌన్ బ్యాంక్ డైరెక్ట్ అభ్యర్థులు కేతం జయచంద్రారెడ్డి, రేమాల బ్రహ్మానందరెడ్డి, అనిల్ రాయల్, మాకం చంద్రయ్య, వాసుదేవ యాదవ్, సురేష్ కుమార్ రెడ్డి, పోలిరెడ్డి నాగిరెడ్డి, మబ్బు నాదముని రెడ్డి, వెంకటేష్ రాయల్, వేమూరి జ్యోతి ప్రకాష్, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ తొండము నాటి వెంకటేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ పొన్నాల చంద్ర, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement