తిరుపతి సిటీ : ప్రజా సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎవరూ సాటిలేరని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమల్లో దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన మంగళవారం వేశాలమ్మ గుడి వీధి నుంచి 15వ డివిజన్ నందు కార్పొరేటర్ నరసింహ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు తో కలిసి గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఆ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికి ఆదర్శమన్నారు.. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను వారి ఇంటి గడప వద్దకు చేర్చడమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో పథకాలు అమలు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా అని తెలుసుకునేందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.. ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్నట్లు వెల్లడించారు.. గత ప్రభుత్వం తరహాలో జన్మభూమి కమిటీలు లాంటి సిఫారసులు లేకుండా అర్హులు దరఖాస్తు చేసుకుంటే సకాలంలో పథకాలు ఇంటి వద్దకే అందించడం జరుగుతుందని వివరించారు.. ప్రజలు డ్రైనేజీ సమస్య. కరెంటు పోర్లు మార్చాలని. సమస్యలు తెలియజేయడం జరిగిందని వాటిని సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరించేలా చర్యలు చెప్పటం జరుగుతుంది వివరించారు.. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష. కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు. హనుమంతు నాయక్. మాజీ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ . తొండమ నాటి. వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు..